ఇప్పటికైనా సమస్య కై ఒక ఆలోచన స్పష్టం చెయ్యకపోతే ఉద్యమం మరింత తీవ్రం చేస్తాం - ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వర్దమా రెడ్డి Telangana RTC Employees Drop Merger Demand

Telangana rtc employees drop merger demand

TSRTC Strike, TSRTC Jac, Telangana Government, KCR, TSRTC Employees, TSRTC Demands

More than 48,000 employees of TSRTC have been on strike since October 5 to press for 26 demands, the main being the merger of TSRTC

ఇప్పటికైనా సమస్య కై ఒక ఆలోచన స్పష్టం చెయ్యకపోతే ఉద్యమం మరింత తీవ్రం చేస్తాం - ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వర్దమా రెడ్డి

Posted: 11/15/2019 10:55 AM IST
Telangana rtc employees drop merger demand

ఆర్టీసీని ప్రభుత్వములో కలపాలి అనే ఆలోచనతో మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె దినదినాభివృది చెందుతూ ఇటు సమస్య అటు సమ్మె ఉదృతం అవుతుంది కానీ సమస్య మాత్రం తీరైన కొలిక్కి చేరటం లేదు..; ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన సర్కార్ లేదనే విషయం మనకు స్పష్టమౌతుంది .. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆ లోచనను ప్రభుత్వం తాత్కాలికంగా

వాయిదా వేసినట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వర్దమా రెడ్డి తెలిపారు..

ఇంతవరకు జరిగిన తెలంగాణ పోరాట ఉద్యమాన్ని ప్రతిబింబిస్తుంది నేటి మన కార్మిక మిత్ర సమ్మె.. సభ్యులు; ముఖ్యం గా కార్మికులు తమ ప్రాణాలను వి డుస్తున్నారు.. గురువారం విద్యానగర్ లో జరిగిన ఎంప్లొయీస్ యూనియన్ కార్యక్రమంలో వివిధ కార్యవేత్తలు,కార్మిక నేతలు చర్చించుకున్నారు.. అయినా కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాథ్యత వహిస్తుంది.. కార్మికుల బలిదానాలకు ప్రభుత్వం నుండి సరి అయినా సమాధానం రాకపోవడం ఎంతో బాధాకర విషయం అని అన్నారు.. దయచేసి ఎవరు ఆత్మహత్య ప్రయత్నాలు చెయ్యవద్దని .. అందరం కలిసి సామరస్యంగా పరిష్కరించుకుందాం అని అన్నారు.. ఆర్టీసీ నేతలంతా ఈ అంశం పై త్వరగా స్పందించాలని భావించారు.. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్య కై ఒక ఆలోచన స్పష్టం చెయ్యకపోతే ఉద్యమం మరింత తీవ్రం చేస్తాం అని హెచ్చరించారు..

15 నవంబర్ శుక్రవారం నేడు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వర్దమా రెడ్డి గారు ఉద్యమాన్ని మరింత ప్రభావితం చేయడానికి ద్వి చక్ర ర్యాలీని నిర్వహిస్తామని ప్రకటించారు.. 16 నవంబర్ శుక్రవారం రోజునా ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ లు రాజిరెడ్డి,సుధా,లింగ మూర్తి భాగ్య నగర్ లో నిరాహారదీక్ష చేస్తామన్నారు.. 17,18 నా డిపోల వద్ద సామూహిక నిరాహార దీక్ష చేస్తామన్నారు.. ఇక 19 నా హైదరాబాద్ నుండి కోదాడ వరకు సడక్ బంద్ ని నిర్వహిస్తామని తెలిపారు..

తెలంగాణ రాష్త్ర నలుమూలల నుండి ఆర్టీసీ కార్మికులు దీక్షలు చేస్తున్నారు,, డిపోల ముందు కూర్చొని తమ ఆవేదనను వెలబుస్తున్నారు.. అయినా ఫలితం లేకపోయింది వారికి.. గురువారం నాడు డిపోల ముందు జరిగిన సమ్మెను పోలీస్ లు అడ్డుకున్నారు.. బస్సులను అనుమతించారు.. నిన్నటికి ఈ సమ్మె అక్షరాలా 41 రోజు లకు చేరింది..అయినా సమ్మె తాలూకు ఫలితం రాకపోయే సరికి ఇటు ప్రజలు అటు కార్మికులు తీవ్ర భ్రాంతులకు గురు అవుతున్నారు,, కొందరు తమ ప్రాణాలను విడుస్తున్నారు.. ఉద్యోగం ఏం అవుతుందో అనే దిగులుతో ఒక కార్మికుడు బుధవారం నాడు మరణించారు.. మహిళా కండక్టర్ పుష్పలత ఆరోగ్యం దెబ్బ తిని ఆసుపత్రిలో చికిత్య పొందుతున్నారు.. ఇలా ప్రతి ఒక కార్మికుడు తమ తమ ఆరోగ్యాలను కూడా లెక్కచెయ్యక సమ్మెను ముందుకు తీసుకు వెళ్తున్నారు.. .

గురువారం నాడు 6198 బస్సులను నడిపినట్లు ఆర్టీసీ ప్రభుత్వం తెలిపింది.. 4322 బస్సులు ఆర్టీసీవి కాగా 1876 అద్దె బస్సులను ఉపయోగిచినట్లు తెలిపింది..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Strike  TSRTC Jac  Telangana Government  KCR  

Other Articles