Huzurnagar bypoll result: TRS huge lead ‘చే’జారిన హుజూర్ నగర్.. ఉప ఎన్నికలో కారు జోరు..

Trs takes huge lead in huzurnagar byelection in telangana

bypoll results, election results 2019, bypoll election results, byelection results, Assembly bypoll results 2019, bypolls, bypolls election result updates, Telengana bypoll results, TRS, congress, Huzurnagar bypoll result, saidi reddy, padmavati, huzurnagar, by-election, TRS, congress, Telangana, politics

Ruling TRS has taken huge lead in the bye-elections to Huzurnagar Assembly constituency, where the counting of votes began. S Saidi Reddy of TRS established early lead of 40,476 votes in the first round over his nearest rival Padmavathi Reddy of opposition Congress party.

‘చే’జారిన హుజూర్ నగర్.. ఉప ఎన్నికలో కారు జోరు..

Posted: 10/24/2019 01:55 PM IST
Trs takes huge lead in huzurnagar byelection in telangana

యావత్తు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బ్రేక్ చేసింది. గత నాలుగు పర్యాయాలుగా ఇక్కడి నుంచి బరిలో నిలిచి పిసిసి అధ్యక్ష పదవిని అందుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ సారి ఓటమిని చవిచూడక తప్పలేదు. రమారమి ఏడాది క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి గెలుపోందిన ఉత్తమ్.. ఆ తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక తప్పలేదు.

అయితే తానే పీసీసీ అధ్యక్షుడు కావడంతో వచ్చిన అవకాశాన్ని తన సతీమణి పద్మావతికి అందించాడు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో అమెను అభ్యర్థిగా ప్రకటించిన ఆయన.. అమె అదృష్టాన్ని మరోసారి పరీక్షించాడు. అయితే ఏడాది క్రితం రిపీట్ అయిన ఫలితమే మరోమారు పునరావృతం అయ్యాయి. హుజూర్ నగర్ ను తన ఖిల్లాగా మార్చుకున్న ఉత్తమ్.. అందులోనూ దశాబ్దాలుగా కాంగ్రెస్ కు అనుకూలంగా వున్న నల్గోండ జిల్లా.. ఈ ఉపఎన్నికలో మారిపోయింది.

ఇవాళ సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్ లోనే లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత చూపుతున్నారు. లెక్కింపునకు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్లు జరగనుంది. ఒక్కో టేబుల్ కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్, పరిశీలకుడిని నియమించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకుడు సచీంద్ర ప్రతాప్‌ సింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రౌండుకు ర్యాండమ్ గా రెండు ఈవీఎంల ఫలితాలు సరిచూసిన తర్వాతే.. ఫలితాన్ని వెల్లడిస్తున్నారు.

లెక్కింపులో భాగంగా తొలుత ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సర్వీసు ఓట్ల లెక్కించారు. కాంగ్రెస్ కంచుకోటలో గులాబి జెండా రెపరెపలాడటంతో.. బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తమ అంచనాలు తారుమారయ్యాయని.. తమ ఖిల్లాలో ప్రత్యర్థి జెండా ఎలా ఎగురుతుందన్న దానిపై మేధోమధనం చేయనుంది కాంగ్రెస్.  10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేవరకు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో వున్నారు.

ఇక 20వ రౌండ్ కౌంటింగ్ చేపట్టిన నాటికి సుమారుగా 40 వేల ఓట్ల అధిక్యంలో వున్నారు. మొత్తంగా హుజూర్ నగర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన భారీ అధిక్యతను నిరూపించుకోవడంతో.. ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోయింది. సైదిరెడ్డి ఇళ్లు, కార్యాలయం సహా పార్టీ కార్యాలయంలోనూ కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత సైదిరెడ్డి ఏకంగా 43 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saidi reddy  padmavati  huzurnagar  by-election  TRS  congress  Telangana  politics  

Other Articles