HC slams telangana govt over dengue fever ఐఏఎస్ అధికారుల పనితీరుపై హైకోర్టు సీరియస్

High court slams telangana govt over dengue fever

High Court, Mosquito, monsoon, Khammam district, HC, dengue fever, Hyderabad, IAS officers, Politics

Telangana high court has asked the state chief secretary and the entire top brass of the government’s health and municipal administration departments to remain present in court to explain what they have done to contain dengue in the state.

తెలంగాణలో డెంగ్యూ నియంత్రణ చర్యలపై హైకోర్టు సీరియస్

Posted: 10/24/2019 03:02 PM IST
High court slams telangana govt over dengue fever

తెలంగాణలో డెంగ్యూ సహా పలు వైరల్ జ్వరాల వ్యాప్తి నివారణపై ప్రభుత్వ చర్యలు మృగ్యమయ్యాయని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు జ్వరాల బారిన పడుతుంటే ప్రజల సంక్షేమాన్ని, అరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాధి నేతలు, ఉన్నతాధికారులకు కనీసం చలనం లేకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డెంగ్యూ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ ప్రబలకుండా ప్రజల్లో కనీస అవగాహన కల్పించి.. ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.

రాష్ట్రంలో డెంగ్యూ మరణాల నేపథ్యంలో కరుణ అనే వైద్యురాలు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై గత కొంతకాలంగా హైకోర్టు ధర్మాసనం విచారణ చేపడుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఆర్‌ఎన్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిల్‌పై మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డెంగ్యూ ప్రబలకుండా వుండేదుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అడ్వొకేట్‌ జనరల్‌ నివేదిక సమర్పించారు. కాగా, దీనిని పరిశీలించిన న్యాయస్థానం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

రోగాల బారిన పడి ప్రజలు చనిపోతున్నా.. ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం సరిగా లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అవి కేవలం కాయితాలకు మాత్రమే పరిమితం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆచరణలో ఎక్కడా చర్యలు చేపట్టినట్లు కనబడటంలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, హోర్టింగ్‌లు ఎక్కడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు మృగ్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

డెంగ్యూ మరణాలను నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందిందని హైకోర్టు మండిపడింది. డెంగ్యూను నివారించలేకపోతే మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారంగా చెల్లించాలని వ్యాఖ్యానించింది. ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులదేనని స్పష్టంచేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగుంటే ప్రజలు కోర్టులకు ఎందుకు వస్తారు? అని ప్రశ్నించింది. మూసీ నదిని ఉత్నతాధికారులు పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అయితే అధికారులు చెబుతున్న చర్యలన్నీ కాయితాలకే పరిమితం అయ్యిందని న్యాయస్థానం అక్షేపించింది.

ఇక పనిలో పనిగా రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు కూడా న్యాయస్థానం అక్షింతలు వేసింది. ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దడానికి ఎంతో ప్రజాధనం ఖర్చు చేస్తున్నది ఈ తరహా పనికేనా? అంటూ ప్రశ్నించింది. సామాన్యులకు సమస్యలు వస్తే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదని.. ఇకనుంచి సుమోటోగా కేసులు స్వీకరించాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. ఐఏఎస్‌లు కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్టు లేదని వ్యంగంగా వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. పత్రికల్లో ప్రతి పేజీలోనూ సమస్యలపై వార్తలు వస్తున్నాయని పేర్కోంది. నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారుల జేబుల నుంచి బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  Mosquito  monsoon  Khammam district  HC  dengue fever  Hyderabad  IAS officers  Politics  

Other Articles