Haryana: Congress giving a tough fight to BJP హర్యానాలో ఉత్కంఠ.. కింగ్ మేకర్ గా దుశ్యంత్‌ జేజేపి

Haryana election result 2019 congress giving a tough fight to bjp

Haryana assembly elections, Haryana assembly election results, Haryana election 2019, congress, BJP, Manoharlal khattar, Dushyant Chautala, PM Modi, Amit Shah, jannayak janata dal party, Haryana, politics

Haryana Election Result 2019 Live Updates: BJP and Congress are locked in a close fight; BJP leads in 40 seats and Congress in 33 seats.

హర్యానాలో ఉత్కంఠ.. కింగ్ మేకర్ గా దుశ్యంత్‌ జేజేపి

Posted: 10/24/2019 01:01 PM IST
Haryana election result 2019 congress giving a tough fight to bjp

హర్యానాలో తాము ఏకపక్షంగా అధికారంలోకి వస్తామని బీరాలు పోయిన బీజేపికి చావు తప్పి కన్నులొట్టపోయిందన్న చందంగా మారింది. కాగా పూర్తి అధికారం రాకపోయినా.. రాష్ట్రంలో పెద్ద పార్టీగా మాత్రం అవతరించింది. బీజేపి విజయం నల్లేరుపై నడక అంటూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసినా.. అవన్నీ తారుమారయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపి గెలిచేందుకు స్పష్టమైన అవకాశాలున్నాయని వేర్వేరు సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అయితే, తాజాగా వెలువడుతున్న ఫలితాలను చూస్తుంటే హరియాణాలో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉంది.

మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు వుండగా.. జాతీయ పార్టీలైన బీజేపి, కాంగ్రెస్ ల మధ్య తీవ్ర ఉత్కంఠకు ఇక్కడి ఫలితాలు దారితీస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ప్రస్తుతం 40 స్థానాల్లో బీజేపి విజయం దిశగా పయనిస్తోంది. అయితే కాంగ్రెస్ 31 స్థానాల్లో,  దుశ్యంత్‌ చౌతాలా నాయకత్వంలోని జననాయక్ జనతాదళ్ పార్టీ 11 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక మిగిలిన స్థానాల్లో ఇతరులు, స్వతంత్రులు తమ అధిపత్యాన్నిచాటుకుంటున్నారు.  ష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 సీట్లు అవసరం. ఇప్పటివరకు ఏ పార్టీ మెజార్టీ మార్క్ ను దాటలేదు.

కింగ్‌మేకర్‌గా దుశ్యంత్‌ చౌతాలా..

తాజా పరిణామాలను చూస్తుంటే ఓం ప్రకాష్ చౌతాల మనవడు (పెద్దకుమారుడి కొడుకు) దుశ్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతాదళ్ పార్టీ కింగ్‌మేకర్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే అటు బీజేపి, ఇటు కాంగ్రెస్‌ దుశ్యంత్ తో సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. బీజేపి మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ నేతలు జేజేపీ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. అకాలీదళ్‌ నేతలకు దుశ్యంత్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. అటు కాంగ్రెస్‌ కూడా దుశ్యంత్ కు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles