తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరోసారి కలకలం చెలరేగింది. ఆలయ ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయం కావడమే ఇందుకు కారణమయ్యింది. గతంలో జరిగిన ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్వామివారి అభరణాలు ఎలా మాయం అయ్యాయి..? ఎవరు తస్కరించారు.? అన్న విషయమై ఎలాంటి ఊసులేకుండానే అధికారులు చర్యలు తీసుకున్నారు.
స్వామివారి కిరీటం, బంగారు ఉంగాలు మాయం కావడానికి టీటీడీ ఏఈవో శ్రీనివాసులను బాధ్యుడ్ని చేసిన ఆలయ ఉన్నాతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను ఆయన నెలసరి వేతనం నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా స్వామివారి చెంత ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందిస్తున్న జేఈవో శ్రీనివాసులుపై ఉన్నతాధికారులు ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్వామివారి ఆభరణాల మాయం ఘటనకు ఆయను బాద్యుడ్ని చేసి ఏకపక్షంగా చర్యలు తీసుకుంటారా.? అంటూ కొందరు నిరసన తెలుపుతున్నారు. కాగా ఇలాంటి తప్పులు చేసిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం రికవరీ మాత్రమే చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
స్వామి వారికి నిత్యం అలంకరించే 290 ఆభరణాల్ని మినహాయిస్తే... మిగిలిన నగలన్నింటిని టీటీడీ ట్రెజరీలో భద్రపరుస్తుంది. అయితే ట్రెజరీలో 2012లో కూడా ఓ దొంగతనం జరిగింది. అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ట్రెజరీలో ఉన్న అమెరికన్ డైమండ్స్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరకడంతో అప్పట్లో ఈవార్త టీటీడీలో సంచలనం సృష్టించింది, ఆ తర్వాత ట్రెజరీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. అయితే పూర్తిస్థాయి భద్రత పెంచామన్నప్పటికీ మరోసారి శ్రీవారి నగలు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనికి బాద్యత వహిస్తూ అక్కడు పనిచేసే టీటీడీ ఏఈవో శ్రీనివాసులు జీతం నుంచి ప్రతీ నెల రూ. 30వేల రికవరీ చేస్తున్నారు. అయితే ఇప్పటిరవరకు అతనిజీతం నుంచి దాదాపు ఏడున్నర లక్షల వరకు రాబట్టినట్లు సమాచారం.
తాజాగా శ్రీవారి ఆలయంలో జరిగిన ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ నిర్లక్ష్యంపై చర్యలకు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే ఉన్నతాధికారులతో పాటు.. సీఎంకు అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని చెబుతున్నాయి.టీటీడీ ఆర్థిక శాఖ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపిస్తున్నారు.
మరోవైపు శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు కారకులు ఎవరే విషయాన్ని నిర్ధారించుకోకుండానే శ్రీనివాసులు నుంచి రికవరీ చేయడాన్ని తప్పుబడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more