Cheapest Air Conditioner by Manoj patel అతితక్కువ ధరకే ఎయిర్ కండీషనర్లు..

Air conditioner for homes and offices uses no electricity

evaporative cooling, post-harvest loss, SDG11, SDG7, purveyors of low-cost, low-cost ACs, Manoj patel, Vadodara, Gujarat, pot cooling formula, Air conditioners with no use of power, single tank, cheapest Air Conditioner, business

Evaporative coolers concept has been applied to air conditioning by a Vadodara man. Manoj Patel Design Studio in Vadodara, Gujarat (India) has built evaporative air conditioners that can cool a room for days on a single tank of water.

విద్యుత్ అవసరం లేకుండా నడిచే ఎయిర్ కండీషనర్.. ధరెంతో తెలుసా.?

Posted: 08/26/2019 02:19 PM IST
Air conditioner for homes and offices uses no electricity

వేసవికాలం వచ్చిందంటే చాలు కరెంటు మీటర్లు చూసి అందరికీ గుండె గుబేలుమంటుంది. ఫ్యాన్లు, కూలర్లు.. సంపన్నులైతే విండో ఏసీలు, స్ప్లిట్ ఏసీలు.. ఇక వీరిని మించిన సంపన్నులైతే సెంట్రల్ ఏసీలు అమర్చకుని వాటిలోంచి వచ్చే చల్లని గాలితో వేసవితాపం నుంచి విముక్తులవుతారు. ఇక ఇలాంటి వసుతులకు దూరంగా వున్న గ్రామీణ భారతంలోని పేదలు చేసేది లేక ఏ వేప చెట్టు కిందకో వెళ్లి హాయిగా సేదతీరుతుంటారు. అసలు ఏసీ అంటే వినడమే కానీ, దానిని చూడటం, లేదా దాని నుంచి వచ్చే గాలిని అస్వాదనకు చాలా దూరంగా వున్నారు.

ఇప్పటికి భారత్ అభివృద్ది చేందుతున్న దేశం కిందకు రాదని అన్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇండియా అభివృద్ది చెందిన దేశంగానే పరిగణించాలని వ్యాఖ్యలు చేశారు. కానీ అసలు భారతదేశంలో అత్యధికులు నివసించే గ్రామీణం ఇంకా అభివృద్దికి ఆమడ దూరంలో వుందన్న చేధు నిజం మాత్రం ఆయన చెవిన వేసేది ఎవరో.?. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఏసీలు పేదల నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన ఓ యువకుడు శ్రమించాడు. ఈ ఏసీలు ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా పనిచేస్తాయంటే ఆశ్చర్యపోతున్నారు కదూ..

ఇక ఈ ఏసీ ధరెంతో తెలిస్తే మీరు నిజంగా షాక్ తింటారంటే నమ్మండీ.? ఇంతకీ ధరెంతో..? అంటారా.? 800 రూపాయలు మాత్రమే. ఔనా.? ఎక్కడ లభిస్తోంది.. ఇప్పుడే అర్డర్ చేస్తాం అంటున్నారు కదూ.. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన మనోజ్ పటేల్ అనే యువకుడు తన వినూత్న ఆలోచనతో ఓ ఏసీని తయారు చేశాడు. మట్టికుండల్లో నీరెందుకు చల్లగా  వుంచే అత్యంత సూక్ష్మమైన రంద్రాలని.. వాటి ద్వారా నీరు ఆవిరి కావడంతోనే నీటిలో చల్లదనం పెరుగుతుందని.. అదే సూత్రంగా చేసుకుని అత్యంత చౌకైన, విద్యుత్ అవసరం లేని మూడు రకాల ఏసీలను తయారుచేశారు. ఒక్కో ఏసీకి అయిన ఖర్చు కేవలం రూ. 800 మాత్రమే. ఈ ఏసీ 32 డిగ్రీల ఉష్టోగ్రత వున్న గదిలోని వేడిమిని 23 డిగ్రీల వరకూ తగ్గించేస్తోంది. మనోజ్ పటేల్.

ఎంతో మంది మధ్య తరగతికి ఇంకా దగ్గరకాని ఎయిర్ కండిషనర్లను అందించాలన్న తపన మనోజ్ పటేల్ ను ఈ ఆవిష్కరణ దిశగా నడిపించింది. ఈ ఆలోచనతో మట్టికి బదులుగా పింగాణీని వాడి, మూడు మోడళ్లలో ఏసీ మెషీన్లను తయారు చేశాడు. ట్యాంకులోని నీటి మోతాదును చెప్పేందుకు ఓ సూచికను ఏర్పాటు చేశాడు. ఇందులోనే ఓ మొక్క పెంచుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఆఫీసుల్లో, ఇళ్లల్లోనూ వాడుకోవచ్చు. పింగాణీ ఏసీలో ఒక ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఉంటుంది. ఒకసారి నీటి ట్యాంకును నింపితే 12 రోజుల వరకు ఆ నీటిని వాడుకుని చల్లదనాన్ని పొందవచ్చు. పింగాణీ, రాళ్లు, మట్టి తదితరాలను మాత్రమే ఇందులో వాడటం వల్ల ఖర్చు తక్కువైందని మనోజ్ చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles