Nepal refutes Indian Army's abominable yeti claim ‘యతి’ కాదు.. ఎలుగుబంటి పాదముద్రలు: నేపాల్ ఆర్మీ

It was a bear nepal army negates indian army s yeti claim

yeti, yeti footprints, Mountain bear, snow bear, yeti history, yeti news, indian army, army yeti, yeti prints, Indian Army, SNOWMAN, Twitter, himalayas, Yeti, Memes, yeti foot prints

Nepal's army refuted the Indian military's hairy claim that its soldiers had discovered yeti footprints in the Himalayas, saying they were more likely just a bear.

అవి ‘యతి’ జాడలు కాదు.. ఎలుగుబంటి పాదముద్రలు: నేపాల్ ఆర్మీ

Posted: 05/03/2019 07:19 PM IST
It was a bear nepal army negates indian army s yeti claim

యతి పురుషుడు.. భారీకాయంతో భయంకర రూపంతో మంచుకొండలపైనే సంచరించే మంచుమనిషి. హిందువుల పురణాల్లో మాత్రమే కన్పించే ఈ మంచు మనిషి రూపాన్ని పౌరాణిక చిత్రాల్లోనూ మన సృజనాత్మకత కలిగిన దర్శకులు చూపించారు. ఇది కేవలం ఓ కల్పిత పాత్రే అయినా.. కళ్లకు కట్టేందుకు అలా చూపించారు. ఈ మధ్యకాలంలో భారత ఆర్మీకి చెందిన అధికారుల బృందం యతిపురుషుడు వున్నాడని, అందుకు గల సాక్షాలు కూడా వున్నాయనడం నిజంగా విస్మయానికి గురిచేస్తున్నాయని ఇటీవల ఓ శాస్త్రవేత్త అన్నారు.

ఇక తాజాగా నేపాల్ ఆర్మీ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మకాలులో తమకు మిస్టరీ మంచుమనిషి యతి పాదముద్రలు కనిపించాయని భారత సైన్యం చేసిన ప్రకటనను నేపాల్ సైన్యాధికారులు కొట్టి పారేశారు. మంచుపై కనిపిస్తున్న భారీ పాదముద్రలు యతివి కావు, ఎలుగుబంటి అడుగుజాడలని నేపాల్ సైన్యం పేర్కోంది. భారత అర్మీ చెబుతున్నట్లుగా ఆ గుర్తులు రహస్యమయ మంచుమనిషి యతి పాదాలవి కాదని తెలిపింది. ఈ మేరకు నేపాల్ సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ బిజ్ఞాన్ దేవ్ పాండేయ్ అంగీకరించలేదు.

భారత సైన్యానికి చెందిన ఏ బృందం ఈ కాలి గుర్తులు చూసిందో వారితో పాటు నేపాల్ సైన్యానికి చెందిన లైజన్ అధికారి, ఒక స్థానిక పోర్టర్ కూడా ఉన్నారని.. వాళ్లిద్దరూ ఈ పాదముద్రలు మంచుమనిషివి కావు..ఎలుగుబంటివని చెప్పారని అన్నారు. ఆ ప్రాంతంలో తరచుగా ఇలాంటి గుర్తులు కనిపిస్తుంటాయి. ఎందుకంటే అక్కడ మంచు ఎలుగుబంట్లు నివసిస్తాయి. నేపాల్ సరిహద్దుల్లో ఉండే మకాలు ప్రాంతంలో నివసించే గ్రామీణ ప్రజలు ఎన్నోసార్లు మంచుపై ఇలాంటి అడుగుజాడలు చూసినట్టు జనరల్ బిజ్ఞాన్ దేవ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Army  SNOWMAN  Twitter  himalayas  Yeti  Memes  yeti foot prints  nepal army  

Other Articles