congress doubts over raise in voting percentage after 5 pm సమయం ముగిసిన తరువాత.. పోలింగ్ శాతం ఎలా పెరిగింది?: కాంగ్రెస్

Congress demands cec to release the details of call sheets issued after 5 pm in telangana

voting after 5 pm, congress raises doubts over raise in voting percentage after 5 pm, congress doubts over raise in voting percentage, marri shasidhar reddy, renuka chowdary, niranjan, congress, TRS, Telangana election officers, KCR, Telangana CM, Congress, Telangana, politics

congress raises doubts over raise in voting percentage after 5 pm, demands CEC to release the details of call sheets issued to voters after 5 pm in Telangana

సమయం ముగిసిన తరువాత.. పోలింగ్ శాతం ఎలా పెరిగింది?: కాంగ్రెస్

Posted: 05/03/2019 08:03 PM IST
Congress demands cec to release the details of call sheets issued after 5 pm in telangana

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా అవకతవకలు జరిగాయనీ, ఈ విషయమై విచారణ జరిపించాలని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదును అందజేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత భారీ పోలింగ్ నమోదయిందని.. ఇదెలా సాధ్యమని అనుమానాలు వ్యక్తం చేసిన నేతలు, ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు రేణుకా చౌదరి, మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ తదితరులు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకుని ఈ మేరకు పిర్యాదును అందజేశారు.

అనంతరం మీడియాతో శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ, సాయంత్రం 5 గంటల తరువాత పోలింగ్ శాతం పెరగడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎన్నికల అధికారి రజత్ కుమార్ పోలింగ్ అనంతరం వ్యాఖ్యానించారని ఆయన ఆరోపించారు. సాయంత్రం 5 గంటల తరువాత ఒక్కో నియోజకవర్గంలో లక్షల్లో ఓట్లు పోల్ అయ్యాయని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో కనిపించని లక్షల మంది ఓటర్లు సాయంత్రం ఐదు గంటల తరువాత ఎక్కడ ఓట్లు వేశారని ఆయన ప్రశ్నించారు.

నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, హైదరాబాదులలో ఐదు గంటల తర్వాత లక్షల ఓట్లు పోలింగ్‌ కావడంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇదే సమయంలో చేవెళ్లలో మాత్రం పోలింగ్ శాతం గతంలో కంటే 5 శాతం తగ్గిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలనీ, సాయంత్రం 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న ఎంత మందికి కాల్ చిట్టీలు ఇచ్చారో రికార్డులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అక్కడి ప్రభుత్వంతో ఈసీ జతకట్టిందా.? అన్న అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

పోలింగ్ శాతం పెరుగుదలపై ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ సీనీయర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో గెలవబోయేది తాననేని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో పలువురు పిల్లలు చనిపోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు. గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు వెనుకంజ వేస్తున్నారని అమె ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles