monkey barging into Lucknow toll booth to steal money కోతికి దొంగతనం నేర్పిన వాహనదారుడు.. ఏం చేశాడంటే..

Video viral monkey barging into lucknow toll booth to steal money

Monkey, money, robbery, video viral, nation, theft, Lucknow Toll booth, animals, Uttar Pradesh, viral video, social media, chandigarh, Crime,

The video of a monkey stealing money at a Lucknow toll booth has gone viral on social media. It shows a white vehicle, where the man inside it rolls down the window and a monkey leaps out and steals the cash before escaping.

ITEMVIDEOS: కోతికి దొంగతనం నేర్పిన వాహనదారుడు.. ఏం చేశాడంటే..

Posted: 05/03/2019 06:36 PM IST
Video viral monkey barging into lucknow toll booth to steal money

కోతి నుంచి మనిషి ఉద్భవించాడని శాస్త్రవేత్తలు చెప్పడం సంగతి అటుంచితే.. మనిషి తర్పీదును అందిపుచ్చుకున్న కొతులు మాత్రం వారు చెప్పినట్టలా అడి.. సామాన్య జనులను ఆనందపడేలా చేస్తుంటాయి. అయితే మూగజీవాలను హింసించడం అన్న చట్టం అమల్లోకి వచ్చేసరికి.. కోతులను అడించుకుని పొట్టపోసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి మాత్రం తన దైనందిన అవసరాలు, జల్లాలు తీర్చుకోవడం కోసం ఏకంగా కోతిని దొంగగా మార్చాడు.

అదెలా అంటే.. కోతికి దొంగతనం చేయడం నేర్పించాడు. టోల్ గేట్ బూత్ నుంచి దాని సాయంతో రూ. 5 వేలు ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన కాన్పూర్ సమీపంలోని డెహత్ దగ్గర ఉన్న బారా టోల్ ప్లాజాలో జరిగింది. టోల్ గేట్ లో అమర్చిన సిసిటీవీల్లో ఈ దొంగతనం తాలుకు వీడియోలు నిక్షిప్తం కావడంతో.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

టోల్ గేట్ వద్దకు ఓ కారు వచ్చి ఆగగానే, కారు కిటికీలో నుంచి ఓ మర్కటం గబుక్కున బయటకు దూకి క్యాబిన్ కిటికీ గుండా లోపలికి వచ్చింది. దాన్ని చూసి కంగారు పడిన టోల్ స్టాప్.. దానిని తరిమేందుకు యత్నించాడు. అయితే అది వెనక్కు వెళ్లి ఏకంగా డబ్బు ఉంచే సొరుగు నుంచి చేతికందినంత తీసుకుని అంతే వేగంగా వెనక్కు వెళ్లిపోయింది. ఈ హాఠాత్పరిణామం నుంచి తేరుకునే సరికే కోతి అక్కడి నుంచి వెళ్లిపోయి కారులోకి చేరింది. కోతి తీసుకెళ్లిన డబ్బును తీసుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఔనా అంటున్నారు కదూ.. మీరే ఈ వీడియోను వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Monkey  money  robbery  video viral  Lucknow Toll booth  Uttar Pradesh  viral video  social media  

Other Articles

Today on Telugu Wishesh