JC Diwakar Reddy sensational comments on Chandrababu చంద్రబాబును టార్గెట్ చేస్తూ జేసీ సంచలన వ్యాఖ్యలు..

Mp jc diwakar reddy sensational comments on chandrababu

AnantaPuram TDP MP, MP JC Diwakar Reddy, JC Diwakar Reddy sensational comments, JC Diwakar Reddy comments on TDP Party President, JC Diwakar Reddy Chandrabau naidu, JC Diwakar Reddy sitting MPs, JC Diwakar Reddy Prabhakar reddy, Andhra pradesh, Politics

AnantaPuram TDP Member of Parliament JC Diwakar Reddy sensational comments on his own Party President and Andhra Pradesh CM Chandrabau naidu.

చంద్రబాబును టార్గెట్ చేస్తూ జేసీ సంచలన వ్యాఖ్యలు..

Posted: 03/02/2019 05:52 PM IST
Mp jc diwakar reddy sensational comments on chandrababu

రాష్ట్ర రాజకీయాలలో ఎవరితోనూ పెద్దగా మిత్రుత్వం.. శతృత్వం లేని సీనియర్ నేత.. తనకు ఏదనిపిస్తే అది అవతలివారు ఎంతవారైనా నిర్మోహమాటంగా వారి ముఖం మీద చెప్పగలిగే నాయకుడు, అనంతపురం పార్లమెంటరీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి.. మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి మళ్లీ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్ చేశారు. సర్వసాధారణ వ్యాఖ్యలు కాకుండా ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అధినేతగా వున్న పార్టీలో కొనసాగుతూ ఆయననే టార్గెట్ చేయడం జేసీకి వెన్నతో పెట్టిన విద్య. మిగతా నాయకులు పదవుల కోసమే లేక మరో విషయంలోనో వెనక్కి తగ్గాలని అలోచిస్తారు కానీ జేసీ మాత్రం విభిన్నం. ఈ సారి ఆయన చేసిన కామ్రెంట్స్ ఏంటంటే.. చంద్రబాబు తనను చూసి జనం ఓట్లేస్తారని భ్రమల్లో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే 30 శాతం నుంచి 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని స్పష్టం చేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే ఈ సారి చంద్రబాబుకు కష్టమేనన్నారు. ఎమ్మెల్యేలను మారిస్తేనే మరోసారి చంద్రబాబు రాజ్యం వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175 నియోజకవర్గాల్లోని ప్రజలు.. చంద్రబాబును చూసే కాకుండా తమ ఎమ్మెల్యేను కూడా పరిగణనలోకి తీసుకుంటారనే అర్థం వచ్చేలా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. అనంతపురం ఎంపీగా ఈ సారి తన కొడుకు జేసీ పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలని దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. అయితే, అనంతపురం లోక్‌సభ పరిధిలోకి అనంతపురం అసెంబ్లీ సెగ్మెంట్ కూడా వస్తుంది.

కానీ, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, జేసీ దివాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  చంద్రబాబు ఎన్నిసార్లు సర్దిచెప్పినా నేతలు ఎక్కడా తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభాకర్ చౌదరిని టార్గెట్‌గా చేసుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ అనంతపురం ఎంపీగా జేసీ పవన్ కుమార్ రెడ్డి బరిలోకి దిగితే, ప్రభాకర్ చౌదరి సహకరిస్తారా? లేదా అనే సందేహం జేసీ దివాకర్ రెడ్డిలో నెలకొన్నట్టు కనిపిస్తోంది. అందుకే, ముందస్తు వ్యూహంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  Chandrababu  Prabhakar reddy  sitting MLAs  Andhra pradesh  Politics  

Other Articles