good days to daily waged farmers in Tamil Nadu వాంటెడ్ ఫార్మర్స్.. రైతుకు మంచి రోజులు..

Tamil nadu keerai kadai gives advt asking wanted farmers

good days to farmers, farmers being paid salaries, organic farming, organic crops, organic food products, landless farmers, keerai kadai, tamil nadu

Days are changing, man is so consious on his health, hence he is forming a group under a society and cultivating organic crops, which in turn brings good days for daily waged farmers. The Farmers are also being paid by salaries with food and accomidation.

వాంటెడ్ ఫార్మర్స్.. రైతుకు మంచి రోజులు..

Posted: 03/02/2019 04:50 PM IST
Tamil nadu keerai kadai gives advt asking wanted farmers

వాంటెడ్ ఫార్మర్స్... అవును రైతులు కావలెను... దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆరుగాల కష్టించి పనిచేసే రైతన్నకు ఇక మంచి రోజులు రానున్నాయి. రైతన్నలు కూడా ఇకపై వేతనాలపై జీవించే రోజులు వస్తున్నాయి. వేతనం అంటే ఇప్పుడు రైతు కూలీలు ఇస్తున్నట్లుగా రోజు మూడు-నాలుగు వందలు కాకుండా.. ఏకంగా నెలవారీగా 20 వేల రూపాయల ఆకర్షణీయమైన జీతం ఇస్తామంటున్నారు. అంతేకాదు వారు వుండేందుకు బోజన, వసతి సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తారట. ఇంకేమంది రైతన్నలకు మంచి రోజులు వచ్చేసినట్టే కదా.!

ఇన్నాళ్లు పంటలపై అవగాహన లేని వాళ్లు కూడా ఇకపై సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేసిన పంటపై దృష్టి పెడుతున్నారు. దేశవ్యాప్తంగా సహజపద్దతుల ద్వారా పండిస్తున్న పంటలకు అదరన పెరుగుతుంది. వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే వారి దగ్గర్నించి సాధారణ ప్రైవేటు ఉద్యోగుల వరకు తమకు సాధ్యమైనంత వరకు సహజ వ్యవసాయ పధ్దతుల ద్వారా పండించే ఫామ్ కల్టివేషన్ పైవు ఫోకస్ పెడుతున్నారు. తమ కుటుంబానికి కావాల్సిన కూరగాయలు, బియ్యం, ఇత్యాది పంటలను సహజ పద్దతుల ద్వారా పండించినవే తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో రైతన్నలకు మరీ ముఖ్యంగా రైతు కూలీలకు ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ సంస్థ రైతన్నలకు ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించింది.

దేశానికి వెన్నెముక రైతన్న.అటువంటి రైతన్నలు ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కడం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాత ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే బతకడం కష్టమంటూ చాలా రాష్ట్రాల్లో అన్నదాతలు వలస పోయి కూలీనాలీ పని చేసుకుంటున్నారు. దీంతో తమ పిల్లల్ని సైతం ఉద్యోగాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు కానీ వ్యవసాయం చేయడానికి ఏ ఒక్కరు ప్రోత్సాహం అందించడం లేదు. దీంతో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. భవిష్యత్తులో రైతు వ్యవస్థ దెబ్బతిననుంది.

ఇక కొందరు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, తమ సృజనాత్మకతను జోడించి కొత్త సాగు విధానాలు కనిపెట్టి అధిక దిగుబడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా తమిళనాడులోని కోయంబత్తూరు కు చెందిన కీరైకడై అనే సంస్థ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లోకి అందిస్తుంది. ఇక్కడ సంస్థ సేంద్రియ పంటలు, వ్యవసాయ ఉత్పత్తులతో ఈ సంస్థ కొనసాగుతుంది. సేంద్రియ పంటల సాగు చేస్తున్న ఈ సంస్థ రైతన్నల కొరతతో ఇబ్బంది పడుతుంది. తమ వ్యవసాయ క్షేత్రంలో తగినంత మంది రైతులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ సంస్థ మంచి జీతం , భోజనం , వసతి కూడా కల్పిస్తామని రైతులు కావాలని అడుగుతుంది.

అందుకే వాంటెడ్ ఫార్మర్స్ అంటూ ఏకంగా రైతన్నలు కావలెను అని ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. నెలకు 15 వేల నుంచి 20 వేల వరకు జీతం ఇస్తామని, ఉచిత భోజన వసతి కల్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సహజసిద్ధ ఆహారాన్ని సమాజానికి అందించే రైతుల కోసం ఎదురుచూస్తున్నామని, ప్రకృతి వ్యవసాయం చేయగలిగినవారికి మొదటి ప్రాధాన్యత అని పేర్కొంది. ఈ ప్రకటన చూస్తేనే అర్థమవుతుంది మన దేశానికి రైతన్నలు కావలెను అని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers salaries  organic farming  organic crops  landless farmers  keerai kadai  tamil nadu  

Other Articles