pawan kalyan slams bjp for questioning his patriotism బీజేపిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్

Who gave you the patent of patriotism pawan kalyan questions bjp

pawan kalyan, janasena, Pawan Kalyan bjp Leader, Pawan Kalyan patriotism, BJP Patiotism patent, Pawan kalyan allagadda, Pawan Kalyan war comments, pariotism, patent, BJP leaders, andhra pradesh, politics

Actor turned politician, JanaSena Party Chief pawan kalyan asks BJP leaders, who are they to question his patriotism, and also asks who gave them the patent of patriotism.

దేశభక్తిపై మీకు పేటంట్ ఎవరిచ్చారు.? బీజేపిపై జనసేనాని పవన్ ఫైర్

Posted: 03/04/2019 11:05 AM IST
Who gave you the patent of patriotism pawan kalyan questions bjp

పాకిస్థాన్ తో యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల ముందే చెప్పారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో తనపై బీజేపి నేతలు చేస్తున్న విమర్శలపై ధీటుగానే స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చిత్తూరులో ఆదివారం జనసేన కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆయన బీజేపీ నేతలపై మండిపడ్డారు. దేశభక్తిపై బీజేపీకి ఎవరూ పేటెంట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ సమావేశాల్లో మాత్రమే జాతీయ జెండాలు కనిపిస్తాయని, భారత్ మాతాకీ జై అనే నినాదాలు వినిపిస్తాయని అన్నారు. తన దేశభక్తిని ఎవరి వద్దా నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆళ్లగడ్డలో తాను అన్న మాటలు.. అంతకుముందు అనేక పతిక్రలలో పతాకశీర్షకలతో కూడా వచ్చాయని అన్నారు. అయితే అవి తన మాటలు కాదని, రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల మాటలని తాను వివరణ కూడా ఇచ్చానన్నారు. తన వ్యాఖ్యలు పాకిస్థాన్‌ పత్రికల్లో వస్తాయని కలగనలేదని కూడా చెప్పారు.

అయితే వాటిని పట్టుకుని తన దేశభక్తిని శంకించడానికి మీరెవరంటూ బీజేపీ నేతలపై పవన్ విరుచుకుపడ్డారు. మైకుల ముందుకు వచ్చి దేశభక్తి అని తనపై అరోపణలు చేస్తున్న ఓ బీజేపి నేత.. తన దేశభక్తిని శంకిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా.. ఓ వ్యక్తిని ఢీకొడితే కనీసం ఆగకుండా వెళ్లిపోయిన ఈ నేత.. మచ్చకైనా మానవత్వంలేని ఈ నేత.. దేశభక్తి అని అంటున్నారని దుయ్యబట్టారు. తోటి మనిషి ప్రమాదం బారిన పడితేనే అగి అస్పత్రికి తీసుకెళ్లే తత్వం ఏక్కడ.. తన కారే ఢీకొట్టినా.. ఆగకుండా వెళ్లిన మానవత్వం లేని అలాంటి వ్యక్తులు ఎక్కడ.? అని ప్రశ్నించారు.

అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవపరం లేదు అంటూ బీజేపి నేత జీవీఎల్‌ నరసింహారావు ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం 1997లోనే వస్తుందని కొందరన్నారు. అంటే భవిష్యత్తు వారికి తెలుసనా? 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ, చంద్రబాబు, నేను కలిసి తిరుగుతున్నపుడు అవినీతి అంతం చేయాలంటే నోట్ల రద్దు అవసరమని అనుకున్నాం. అంటే నోట్ల రద్దు గురించి మాకు ముందే తెలిసిపోయినట్లా?. అని పనవ్ కల్యాణ్ ధీటుగా ప్రశ్నించారు.

అలాగే పాకిస్థాన్‌పై తాజాగా మెరుపు దాడుల విషయంలోనూ నేను గతంలో చెప్పిన మాటలను ఇప్పుడు వక్రీకరిస్తున్నారు. తాను ఆనాడు విశ్లేషకుల అంచనాలనే నేను ప్రస్తావించాను. తాను మాట్లాడే మంచి మాటలను మీడియాలో చూపించరు. ఒక మాటపై వివాదం రేగితే మాత్రం పక్కదారి పట్టిస్తూ పదేపదే చూపిస్తారు. చర్చలు పెడతారు’ అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  pariotism  patent  BJP leaders  andhra pradesh  politics  

Other Articles