Mohan babu slams Andhra Pradesh Government on Fees Reimbursement ఏపీ సర్కారుపై మోహన్ బాబు ఆగ్రహం..

Mohan babu slams andhra pradesh government on fees reimbursement

Actor Mohan Babu, YS RajaShekar Reddy, Chandrababu, Fees Reimbursement, Kapu students, Andhra Pradesh Government

Actor Mohan Babu lamblasts on Andhra Pradesh Government in delaying students fee reimbursement scheme. The Actor turned educationalist says there are huge pending of fees reimbursement of students.

విద్యార్థుల భవితను పట్టించుకోరా.? సర్కారుపై మోహన్ బాబు ఆగ్రహం..

Posted: 03/02/2019 04:04 PM IST
Mohan babu slams andhra pradesh government on fees reimbursement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విలక్షణ నటుడు మోహన్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థుల భవిషత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. వారికి సకాలంలో ఫీజు రియంబర్స్ మెంటను అందించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. పేద విద్యార్థులకు ఉచితంగా తమ శ్రీవిద్యానికేతన్ ద్వారా విద్యాబాసం అందిస్తుంటే తమను చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మోహన్ బాబు ఫైర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా వున్న సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న హాయంలో పేద, వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని అమలుపర్చి.. పేదరికం కడుపుకే కానీ చదువుకు కాకూడదని.. విద్యార్థులలో వున్న జిజ్ఞాన, వివేకానికి, ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాకూడనది భావించి ఆయన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మోహన్ బాబు అన్నారు. దీని వల్ల లక్షల కోట్ల మందికి మంచి జరుగుతోందని అన్నారు.

అయితే 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో కరెక్టుగా మనకు అనుకన్న సమయాల్లో ఫీజు రీఎంబర్సమెంట్ ఇవ్వకపోగా అప్పుడప్పుడూ బిక్షం వేస్తున్నట్లు ఇచ్చారు. 2017-18లో ఈబీసీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను పక్కకు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అనేది నా ప్రశ్న కాదు. వారికి సంబంధించి రూ. 2 కోట్ల 16 లక్షలు ఇవ్వాలి. వాటిపై ఇప్పటి వరకు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా.? అని ఆయన ప్రశ్నించారు.

2018-19లో దాదాపు 16 కోట్ల చిల్లర బకాయిలు మా విద్యా సంస్థలకు రావాలి. ప్రభుత్వం వారు ఇస్తామంటే ఇస్తామని చెప్పండి. పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు. కాలేజీలను ఇబ్బంది పెట్టొద్దని మోహన్ బాబు సూచించారు. చంద్రబాబు పాలసీలు ఎన్నైనా ఉండొచ్చు. అతడు ఏమైనా చేసుకోవచ్చు. ఇది వేదిక కాదు నేను మాట్లాడటానికి. ఈ రోజుకు నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. రేపు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు.. కానీ విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి నేరుగా ప్రభుత్వాన్నే అడుగుతున్నాని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబును ఉద్దేశిస్తూ మీ బయట వాగ్దానాలు మాకు అనవసరంమని... తమ పిల్లలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మోహన్ బాబు ఫైర్ అయ్యారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐదారు మాసాలుగా ఉత్తరాలు రాశానని చెప్పారు. డియర్ చంద్రబాబు విద్యార్థులు గొప్పవారు కావాలన్న మీ అకాంక్ష ఎలా నెరవేరుతుంది.? వారికి ఇవ్వాల్సిన ఫిజు రియంబర్స్ మెంటు రాకపోతే.. వారు ఉన్నత విద్యను ఎలా అభ్యసిస్తారు.. వారు మళ్లీ ఇబ్బందులకు గురవుతున్నారు.? అని వారి బాధలను వ్యక్తం చేస్తూ ఉత్తరాలు రాసినా చంద్రబాబు సమాధానం చెప్పలేదన్నారు. ఐఏఎస్ అధికారి రావత్ కూడా ఇస్తాం ఇస్తాం అంటూ మమ్మల్ని తిప్పించుకుంటున్నారని మోహన్ బాబు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles