'Don't Play With the Law': SC Asks Karti Chidambaram కార్తీకి తలంటిన సుప్రీం.. విదేశీయానానికి అనుమతి..

First deposit rs 10 crore then go abroad sc tells karti chidambaram

INX Media case, Aircel-Maxis case, Karti Chidambaram, P Chidambaram, Supreme Court

The Supreme Court on Wednesday asked Karti Chidambaram to “not play around with the law” and to cooperate with the investigations in the INX Media and Aircel-Maxis cases.

కార్తీకి తలంటిన సుప్రీం.. విదేశీయానానికి అనుమతి..

Posted: 01/30/2019 03:29 PM IST
First deposit rs 10 crore then go abroad sc tells karti chidambaram

ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్ సెల్‌ మ్యాక్సిస్‌ కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఇవాళ తలంటిన న్యాయస్థానం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనకు ఊరటను కూడా కల్పించింది. కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేసి కార్తీ విదేశాలకు వెళ్లొచ్చని న్యాయస్థానం తెలిపింది.

‘ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడకు వెళ్లొచ్చు. కానీ విచారణకు మాత్రం తప్పకుండా సహకరించాలి. చట్టాలతో ఆడుకోవాలని చూడొద్దు. ఎయిర్ సెల్‌ మ్యాక్సిస్‌, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మార్చి 5, 6, 7, 12 తేదీల్లో ఎన్ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలి. ఒకవేళ మీరు విచారణకు సహకరించకపోతే మేం చాలా తీవ్రంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతమైతే మీరు వెళ్లొచ్చునని సుప్రీం చెప్పింది.

అయితే అందుకోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేయామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అంతర్జాతీయ టెన్సిస్‌ టోర్నమెంట్ల కోసం కొద్ది నెలల పాటు ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న కార్తీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి 26, మార్చి 23 నుంచి 31 మధ్య తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య మాత్రమే కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : INX Media case  Aircel-Maxis case  Karti Chidambaram  P Chidambaram  Supreme Court  

Other Articles