toddler forced to remove black jacket చిన్నారి బ్లాక్ జాకెట్ విప్పించిన సీఎం సెక్యూరిటీ.. విచారణ

3 year old forced to remove jacket by assam cm s security

Crying toddler, assam kid jacket taken off, Chief Minister Assam Sarbananda Sonowal

In a short video clip being circulated on social media, the three-year-old had to remove his black jacket on the instructions of security personnel before entering Sonowal's function in Biswanath district.

చిన్నారి బ్లాక్ జాకెట్ విప్పించిన సీఎం సెక్యూరిటీ.. విచారణ

Posted: 01/30/2019 04:36 PM IST
3 year old forced to remove jacket by assam cm s security

ముఖ్యమంత్రులు పాల్గోనే కార్యక్రమం అనగానే భద్రతా కారణాలు అన్ని అమల్లోకి వస్తాయి. అయితే ఇలాంటి సీఎం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఓ చిన్నారి విషయంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కనబర్చిన అత్యుత్సాహం, మితిమీరి ప్రవర్తన వివాదానికి దారితీసింది. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ బిశ్వనాథ్‌ జిల్లా బోర్గాంగ్ లో ఓ సిల్క్ మిల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

వీరిలో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడితో అక్కడకు చేరుకుంది. చల్లి తీవ్రంగా వున్నందున, అందులోనే అది శీతల ప్రాంత ప్రదేశం కావడంతో.. చిన్నారి నలుపు రంగు జాకెట్‌ వేయించి తీసుకువచ్చింది. అయితే అమెను సీఎం భద్రతా సిబ్బంది సోనోవాల్ కార్యక్రమానికి అనుమతించలేదు. ఆ చిన్నారి వేసుకున్న నలుపు రంగు జాకెట్‌ ను విప్పిన తర్వాతే పోలీసులు అమెను ముఖ్యమంత్రి కార్యాక్రమానికి అనుమతించారు.

ఆ చిన్నారి తల్లి అసహనానికి గురవుతూనే ఆ జాకెట్ విప్పారు. ఆ తర్వాత ఆ పిల్లాడు చలికి వణికిపోయాడు. ఈ తతంగాన్ని అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. దీంతో విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అభంశుభం తెలియని మేడేళ్ల చిన్నారిని దైవంగా కొలిచే సంప్రదాయం మనది.. అలాంటి దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని విపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనపై సీఎం సోనోవాల్‌ స్పందించారు. తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles