'I Will Not Say Sorry': Kanakadurga క్షమాపణ చెప్పబోనని తేగేసి చెప్పిన కనకదుర్గ..

Kanakadurga refuses to back down after family disowns her for sabarimala visit

ayyapa, Bindhu, Kanaka Durga, lord ayyapa, bharat bushan, In laws house, kanaka durga shelterless, security, domestic violence, Perinthalmanna shelter home, Sabarimala, supreme court, politics, crime

Kanakadurga, one of the first women to enter Sabarimala after the Supreme Court verdict, says she will not apologise to anyone for her temple visit and will return home with a court order.

కనకదుర్గ కష్టాలు: మెట్టినిల్లే కాదు.. పుట్టినిల్లు కూడా..

Posted: 01/30/2019 02:42 PM IST
Kanakadurga refuses to back down after family disowns her for sabarimala visit

కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయం తీసుకుని.. తన పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేసుకున్న కనకదుర్గ.. తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగినా.. దాని ప్రతిఫలంగా అనుకోని అనేక ఘటనలు తాను జీవితంలో చూడాల్సివస్తుందని మనోవేదన చెందుతుంది. దేశవ్యాప్తంగా గెలిచిన ఈ మహిళ..  ఇంట మాత్రం ఓడిపోయింది. జనవరి 2న తొలిసారిగా శబరిమల అలయంలోకి ప్రవేశించిన ఇద్దరు నిషిద్ద వయస్సు మహిళలలో అమ ఒకరు.

సనాతన అచారాలను, శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను పక్కనబెట్టి.. స్థానికులు, అయ్యప్పస్వాముల కేరళ భక్త సమాజం, హింధూ సంఘాల బెదిరింపులను తోసిరాజుతూ.. బింధుతో కలసి శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన అమె.. ఇప్పుడు తన సొంతిట్లోకి మాత్రం వెళ్లేలేకపోతుంది. శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన కారణంగా అమె అత్తారింటికి సభ్యులు అమెపై ప్రతికార చర్యలకు పాల్పడుతున్నారని అమె వారిపై న్యాయపోరాటానికి దిగింది. ఆ తరువాత అమె భర్త కూడా అమెను మెడ పట్టి భయటకు గెంటేశాడు. అయనపై కూడా న్యాయపోరాటానికి సై అనింది కనకదుర్గ.

ఇదే సమయంలో అమె సోదరుడు సోదరుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ.. అయ్యప్ప భక్తులకు, హిందూ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పనంతవరకు ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేది లేదని చెప్పాడు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహంలో నివసిస్తున్న అమె తాజాగా పుట్టింటిలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంది. పుట్టింటిటోనూ పరాభవాన్ని వెల్లడించిన అమె, తమవారంతా తనపై చాలా కోపంగా ఉన్నారని వాపోయింది. అయితే, తాను చేసిన పనికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఎటువంటి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోబోనని, ఇంట్లోకి వెళ్లేందుకు చట్టబద్ధంగా పోరాడనున్నానని వెల్లడించింది.

ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 28న శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునని తీర్పును వెలువరించిన తరువాత జనవరి 2న బింధు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించారు. అయితే వీరికి కేరళ ప్రభుత్వం భద్రత కల్పించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం తరువాత అదేశాలను జారీ చేసింది. పరాయి వ్యక్తులు, సంఘాలు దాడి నుంచి భద్రతా సిబ్బంది కాపాడుతారేమో కానీ.. ఏకంగా కుటుంబసభ్యుల నుంచే దాడులు ఎదరుకావడంతో వారు నిష్చేష్టులవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles