Priyanka Gandhi appointed Congress general secretary కాంగ్రెస్ కీలక అడుగు: ప్రియాంకకు ప్రధాన కార్యదర్శి పగ్గాలు..

Priyanka gandhi appointed congress general secretary for uttar pradesh east

Priyanka Gandhi Vadra, General secretary, General Elections, Rahul Gandhi, Congress, Ashok Gehlot, jyothiradhitya scindia, Lok Sabha Elections, Congress, Virbhadra Singh, gulam nabi azad, Haryana, politics

The Congress appointed Priyanka Gandhi the party’s general secretary for the Uttar Pradesh East region in a move that is being seen as her official entry into active politics.

కాంగ్రెస్ కీలక అడుగు: ప్రియాంకకు ప్రధాన కార్యదర్శి పగ్గాలు..

Posted: 01/23/2019 03:02 PM IST
Priyanka gandhi appointed congress general secretary for uttar pradesh east

సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ రాజకీయ వారసుడిగా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే తన సత్తా చాటిన రాహుల్ గాంధీ.. ఇలీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికలలో కొమ్ములు తిరిగిన ప్రత్యర్థులను కూడా ఖంగుతినిపించి రాజకీయంగా పైచేయి సాధించారు. ఈ తరుణంలో రాఫెల్ డీల్ తో మోడీ ప్రభుత్వాన్ని ఇంటాబయట తూర్పారబడుతున్న రాహుల్ గాంధీ.. లోక్ సభ ఎన్నికలకు ముందు మరో కీలక అడుగు వేశారు.

తన సోదరి ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిని అందించారు. అమెను ఏఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమించిన రాహుల్.. సార్వత్రిక ఎన్నికలలో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతం బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోడీ సహా సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ఇదే క్రమంలో ఎస్పీ-బీఎస్పీలతో కలసి ఎన్నికల్లోకి వెళ్తామని కూడా సంకేతాలను ఇచ్చింది.

తూర్పు ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, ప్రిపరేషన్స్‌ను ఇకపై ప్రియాంక గాంధీ పర్యవేక్షించనున్నారు. గత ఎన్నికల్లోఅభ్యర్థుల ఎంపిక దగ్గరనుంచి, ఎన్నికల వ్యూహాల వరకు ప్రియాంక అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అయితే అనధికారిక హోదాలోనే ఆ బాధ్యతలు నిర్వర్తించిన ప్రియాంక.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.పార్టీకి దోహదపడే ప్రతీ ఒక్కరిని ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో భాగంగానే ప్రియాంకకు రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

ప్రియాంక గాంధీతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సమర్థవంతంగా నడిపించిన సింధియాకు ఉత్తరప్రదేశ్ వెస్ట్‌ బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్ వెస్ట్ కాంగ్రెస్‌కు ఆయన జనరల్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. ఇక మరో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా వున్న గులాంనబి అజాద్ కు ఇక హర్యానా రాష్ట్రానికి ఇంచార్జ్ గా నియమించింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ద్వారా తన సోదరికి శుభాకాంక్షలు తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం ప్రియాంక పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన సోదరితో రాజకీయాంగా కలసి పనిచేయడం సంతోషంగా వుందని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలతో కలసి పనిచేస్తామన్నారు. ఉత్తర్ ఫ్రదేశ్ కు ఏం కావాలో కాంగ్రెస్ కు బాగా తెలుసునని రాహుల్ పేర్కోన్నారు. తన సోదరి ప్రియాంక సమర్ధురాలని కూడా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Gandhi Vadra  General secretary  General Elections  Rahul Gandhi  Congress  politics  

Other Articles