23 Crore Power Bill For Home బిల్లుతో మధ్యతరగతి వ్యక్తి షాకిచ్చిన విద్యుత్ శాఖ.!

Man receives rs 23 crore bill for consuming 178 units of electricity

UP Man, Abdul Basit, Electricity Bill, UP Man gets Rs 23 Crore Electricity Bill, Rs 23 crore electricity bill for 178 Units, electricity bill for 178 Units, Rs 23 Crore Bill, Electricity, Uttar Pradesh

A man Abdul Basit, a resident of Kannauj of Uttar Pradesh got the shock of his life when he received a Rs 23 crore electricity bill charged for consuming only 178 units of power.

బిల్లుతో మధ్యతరగతి వ్యక్తి షాకిచ్చిన విద్యుత్ శాఖ.!

Posted: 01/23/2019 03:52 PM IST
Man receives rs 23 crore bill for consuming 178 units of electricity

విద్యుత్ బిల్లుల విషయంలో యావత్ దేశ ప్రజానికం అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఏ అధికారులతోనైనా పెట్టుకోవచ్చు కానీ.. విద్యుత్ శాఖ అధికారులతో పెట్టుకుంటే మాత్రం గుండె గుబేలవ్వడం ఖాయం. ఈ శాఖ అధికారులు మాటలతోనో, తూటాలతోనే కాకుండా కేవలం కాయితం ముక్క (అదేనండీ విద్యుత్ బిల్లు)తో ప్రజలను హడలెత్తించగలరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.

అయితే గత కొన్నాళ్లుగా ఇలాంటి ఘటనకు కోంత బ్రేక్ లభించిందని భావిస్తున్న క్రమంలోనే మరో ఘటన వెలుగుచూసింది.  మధ్యతరగతి కుటుంబానికి కరెంట్ బిల్‌ నెలకు ఎంత రావొచ్చు. రూ.500.. లేకపోతే రూ.1000. పాపం ఓ వ్యక్తికి మాత్రం ఏకంగా రూ.23కోట్ల కరెంట్ వచ్చింది. నెలకు రూ. వెయ్యి కూడా రాని ఇంటికి కోట్లలో బిల్ రావడంతో మనోడికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ ప్రాంతంలో ఈ ఘటన బయటపడింది.

కన్నౌజ్ ప్రాంతంలో నివాసం ఉండే అబ్దుల్ బాసిత్‌కు విద్యుత్‌శాఖ ఉద్యోగి వచ్చి మీటర్ రీడింగ్ చూసి కరెంట్ బిల్లు ఇచ్చి వెళ్లాడు. బిల్ ఎంత వచ్చిందోనని చూసిన బాసిత్‌కు దిమ్మ తిరిగింది. 178 యూనిట్ల విద్యుత్ ఉపయోగించుకున్నందుకు ఏకంగా.. రూ. 23,67,71,524 బిల్ వేశారు. షాక్ తిన్న బాసిత్ వెంటనే విద్యుత్ శాఖ అధికారుల్ని కలిశాడు. రూ.కోట్లలో బిల్ రావడం ఏంటని ప్రశ్నించాడు.

విద్యుత్ అధికారులు తన ఇంటికి వేసిన కరెంట్ బిల్లు.. ఉత్తరప్రదేశ్ మొత్తం బిల్లులా ఉందన్నాడు బాసిత్. తన జీవిత కాలం మొత్తం సంపాదించిన ఈ బిల్లును చెల్లించలేనని చెప్పాడు. బిల్‌ను పరిశీలించిన అధికారులు సాంకేతిక సమస్య వల్ల పొరపాటు జరిగిందని గుర్తించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తామని.. సాంకేతిక సమస్యలతో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయన్నారు. తప్పును సరిచేసిన తర్వాత బాసిత్ బిల్లు చెల్లించొచ్చన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP Man  Abdul Basit  Electricity Bill  Rs 23 Crore  178 Units  Electricity  Uttar Pradesh  

Other Articles