HC orders EC to attend on 30 with complete information ఈవీఎం, వీవీఫ్యాట్ లపై హైకోర్టులో విచారణ.. 30న హాజరుకావాల్సిందే..

High court orders ec to attend on jan 30th with complete information

High Court, chief election officer, malreddy rangareddy, Evms, Electronic Voting Machines, VVPAT Machines, EVM hacking, EVM tampering, VVPAT slips counting, Kapil Sibal, Advocate, Telangana government, Politics

The Telangana High Court orders state chief Election officer to attend court on January 30th with complete information in Congress Leader MalReddy RangaReddy case.

ఈవీఎం, వీవీఫ్యాట్ లపై హైకోర్టులో విచారణ.. 30న హాజరుకావాల్సిందే..

Posted: 01/23/2019 01:36 PM IST
High court orders ec to attend on jan 30th with complete information

గత ఏడాది డిసెంబర్ 11న వెల్లడైన ఓటరు తీర్పుతో మహాకూటమి పార్టీలు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. అధికారంలోని పార్టీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందన్న అరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఓటరు తీర్పును గౌరవిస్తామని హుందాగా స్పందించినా.. పార్టీలోని క్రీయాశీలక నేతలైన రేవంత్ రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహా తదితరులు పరాజయం పాలుకావడం విస్మయానికి గురిచేసింది.

అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథాకాలతోనే మార్పు వచ్చి.. ఆ దిశగా గాలి వీచిందని ప్రజలు భావిస్తున్నారు. కాగా, బీఎస్సీ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన మల్ రెడ్డి రంగారెడ్డి ఎన్నికల లెక్కింపులో అవకతవకలు జరిగాయని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును అశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన పిటీషన్ ను స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 30న సమగ్ర సమాచారంతో న్యాయస్థానంలో హాజరుకావాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల అధికారులకు అదేశించింది.

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన మల్ రెడ్డి రంగారెడ్డి తరపు న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్.. వీవీ ప్యాట్ ప్రింటింగ్ స్లిప్ లు థరల్ పేపర్ పై ప్రింట్ అవుతున్నాయని.. అయితే వీటిపై చేసిన ప్రింటింగ్.. రెండు వారాల నుంచి నెల రోజుల వ్యవధిలో క్రమంగా చెరిగిపోతుందని ఆయన అన్నారు. దీంతో ఎన్నికలలో అవకతవకలు జరిగాయన్న అరోపణల నేపథ్యంలో ప్రత్యర్థులు న్యాయపోరాటం చేసిన తరువాత న్యాయస్థానాల అదేశాల మేరకు ఓట్లను వీవీ ప్యాట్లతో లెక్కించమని చెబితే అప్పటికీ అన్ని వీవీప్యాట్ స్లిప్పులు చెరిగిపోతుందని అయన అన్నారు.

ఇక మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంగా అతిపెద్ద దేశమైన భారత్ లో ప్రజాస్వామ్యాం మరింత పరఢవిల్లాలంటే.. ఎన్నికల కౌంటింగ్ ను వీవీ ప్యాట్ స్లిపులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన విషయంలో రెండు ఈవీఎం యంత్రాలకు.. వీవీ ప్యాట్ స్లిపులకు మధ్య 30 ఓట్ల వత్యాసం వచ్చిందని అలాంటిది మూడు నుంచి నాలుగు వందల ఈవీఎంలతో ఎంత వ్యత్యాసం వస్తుందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ప్రజాధనంతో ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల ఓటుకు కూడా మరింత జవాబుదారి తనం కల్పించేందుకు వీవీప్యాట్ స్లిపులతోనే కౌంటింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  chief election officer  malreddy rangareddy  Evms  VVPAT Machines  Kapil Sibal  Politics  

Other Articles