BSF jawan Tej Bahadur Yadav's son found dead ఆర్మీ అన్నంపై ప్రశ్నించిన బీఎస్ఎఫ్ జవాను కొడుకు మృతి

Son of dismissed bsf jawan who complained about bad food found dead

Rohit, BSF, Tej Bahadur Yadav, Shanti Vihar, Rewari, Border Security Force, Jammu and Kashmir, unpalatable food, Pakistan, Constable, Bahadur Yadav, police official, Rohit, social media, food, Haryana, politics

Rohit, the son of a BSF constable Tej pratap yadav, dismissed from service for posting videos criticising the quality of food served to soldiers has been found dead in a locked room of the family's home with a gun in his hands at Haryana's Rewari.

ఆర్మీ అన్నంపై ప్రశ్నించిన బీఎస్ఎఫ్ జవాను కొడుకు మృతి

Posted: 01/18/2019 02:41 PM IST
Son of dismissed bsf jawan who complained about bad food found dead

దాయాది దేశం పాకిస్థాన్ చోరబాట్లు, సరిహద్దులలో కాల్పుల విరమణకు తూట్లు పోడిచిన క్రమంలో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత ఆ అంశం ఇండియన్ ఆర్మీ గోప్పతనాన్ని చాటుతున్న నేపథ్యంలో అదే ఆర్మీకి సంబంధించి ఏడాది క్రితం.. సైనికులకు ఇచ్చే ఆహారంలో నాణ్యత లేదంటూ.. సంచలన విషయాలను దేశ ప్రజల ముందుకు సోషల్ మీడియా ద్వారా తీసుకువచ్చిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ గుర్తున్నాడుగా?

అతని కొడుకు రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హర్యానాలోని రెవారీలోని ఇంట్లో రోహిత్ మృతదేహం కనిపించింది. రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. రోహిత్ మృతదేహం మంచంపై కనిపించింది. అతని చేతిలో తుపాకీ ఉంది.

జమ్మూకాశ్మీర్‌లోని ఇండో-పాక్ సరిహద్దులో సైనికులకు సరైన ఆహారం ఇవ్వట్లేదంటూ అప్పట్లో బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఆరోపణల్ని ఖండించిన బీఎస్ఎఫ్, ఆ తర్వాత తేజ్ బహదూర్ యాదవ్‌ను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం అతను కుంభమేళాకు వెళ్లాడు. కొడుకు ఆత్మహత్యపై పోలీసులు అతనికి సమాచారమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit  BSF  Tej Bahadur Yadav  Shanti Vihar  Rewari  Border Security Force  Haryana  politics  

Other Articles