Kerala Govt Claims 51 Women Entered Sabarimala బింధు, కనకదుర్గలకు రక్షణకు సుప్రీం ఓకే.!

Sc grants 24x7 police protection to bindu and kanakadurga

women temple, Kanakadurga, Supreme Court, sabarimala, Kerala, Bindu Ammini, Kanaka Durga, 51 restricted age women, security, kerala government

The Supreme Court ruled that the state government should be responsible for providing security to the two women, advocate Bindu and civil supplies employee Kanakadurga, who entered Sabarimala temple on 2 January, should receive 24x7 police protection.

శబరిమలను దర్శించిన 51 మంది మహిళలు.. ఆ ఇద్దరికీ రక్షణ..

Posted: 01/18/2019 03:48 PM IST
Sc grants 24x7 police protection to bindu and kanakadurga

దేశసర్వోన్నత న్యాయస్థానం అవకాశం కల్పించడంతో శబరిమల ఆలయ ఆచారాలను పట్టించుకోకుండా నిషిద్ద వయస్సు గల ఇద్దరు మహిళలు దేవాలయంలోకి ప్రవేశించి స్వామి అయ్యప్ప దర్శనం చేసుకున్న విషయం యావత్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. కాగా ఆ ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని తాజాగా ఆదేశించింది.

దేవాలయంలోకి ప్రవేశించిన నేపథ్యంలో తమను చంపుతామని, దాడులు చేస్తామని కొందరు బహిరంగంగా ప్రకటించడం, ఇక వీరి చర్యపై హింధూ సంఘాలు కూడా భగ్గుమనడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళన మధ్య తామున్నామని, తమకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ ఇద్దరు దాఖలు చేసుకున్న పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... వారిద్దరికి తగిన భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జనవరి 2న బిందు, కనకదుర్గలు.. శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకున్న తరువాత హిందూ సంఘాలు, పలువురి ప్రకటనల నేపథ్యంలో వారు ఏకంగా వారం రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. అయితే మంగళవారం అత్తింటికి వచ్చిన కనకదుర్గపై ఆమె అత్త దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో గాయపడిన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. తమపై మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని భావిస్తున్న ఇద్దరి మహిళలు... తమకు భద్రత కల్పించేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదిలావుండగా, కేరళ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు ఓ సంచలన విషయాన్ని వెలువరించింది. సెప్టెంబర్ 28న అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన తరువాత తొలిసారిగా అడ్వకేట్ బింధు అమ్మిని, పౌర సరఫరాల ఉద్యోగిని కనకదుర్గల ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ఇప్పటి వరకు ఏకంగా 51 మంది నిషిద్ద వయస్సు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం ముందు వివరాలను వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles