RTI applicants sent condoms in response to queries ఆర్టీఐ దరఖాస్తుదారులకు షాక్.. సమాధానం బదులు..

Rti applicants receive condoms instead of response to their query

rajasthan, rti applicants, Rajasthan Information Commission, rti, condom, Manohar Lal, Vikas Chaudhari, Chhani Bari, development work, district administration, Hanumangarh, Probe, SDM Bhadra, crime

When two residents from the Bhadra Tehsil in Rajasthan filed a Right to Information (RTI) query, they did not expect to receive condoms and old newspaper as a response. Hanumangarh district administration began a probe into allegations.

ITEMVIDEOS: ఆర్టీఐ దరఖాస్తుదారులకు షాక్.. సమాధానం బదులు..

Posted: 01/18/2019 12:59 PM IST
Rti applicants receive condoms instead of response to their query

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దేశపౌరుల చేతిలో పశుపాతాస్త్రం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎంతటి క్లిష్టమైన సమాచారమైన రాచమార్గంలో రాజముద్ర వేసుకుని లభించేలా చేసేదే ఈ అస్త్రమని దేశ ప్రజలకు తెలిసిందే. ఇలా లభించే సమాచారం నూటికి నూరుపాళ్లు నిజమైనదే. దీంతో ఈ చట్టాన్ని విరివిగా వినియోగించుకునే ఉద్యమకారులు సమాజాంలో ఎప్పటికప్పుడు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువస్తూనే వుంటారు.

అయితే రాజస్థాన్ లోని ఓ ఉద్యమకారుడికి.. మాత్రం సహా చట్టం కింద లభించిన సమాచారం షాక్ అయ్యేలా చేసింది. అతను ఎదురుచూసిన సమాచారం బదులుగా ఊహించని ‘సమాచార పార్శిల్’ అతడ్ని ఖంగుతినేలా చేసింది. సమాచార పార్శిల్ లో అతడికి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం లభించకపోగా, అతడ్ని అవమానపర్చేలా చిత్తు కాయితాలు.. కండోమ్ లు లభించాయి. ఈ ఘటన రాజస్థాన్‌లోని భద్రా తెహసిల్‌లో చోటుచేసుకుంది.

మనోహర్ లాల్, వికాశ్ చౌదరీ అనే ఇద్దరు ఆర్టీఐ ఉద్యమకారులు తమ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాచారం తదితర వివరాలు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సమాధానం పంపాల్సిన అధికారులు.. కవర్లో కండోమ్‌లు, న్యూస్ పేపర్లను పంపారు. దీంతో ఆ ఉద్యమకారులు ఆర్టీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణ జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rti applicants  condom  Chhani Bari  Hanumangarh  Probe  SDM Bhadra  

Other Articles