Woman alleges rape by Facebook friend and his kin యువతిపై ఫేస్ బుక్ ఫ్రెండ్, అతని సోదరుల గ్యాంగ్ రేప్

Up woman alleges rape by facebook friend his brothers says she was filmed forced to marry

Uttar Pradesh, rape, UP crime, Yogi Adityanath, UP rape, facebook, sexual assault, rape, gangrape, facebook friend and kin rapes woman

A 23-year-old woman has alleged that she was raped by a man she befriended on Facebook. She said that she was also raped by the man’s brothers and was later forced to marry him in Uttar Pradesh’s Shamli district.

యువతిపై ఫేస్ బుక్ ఫ్రెండ్, అతని సోదరుల గ్యాంగ్ రేప్

Posted: 01/05/2019 02:52 PM IST
Up woman alleges rape by facebook friend his brothers says she was filmed forced to marry

అవసరానికి మించిన సామాజిక మాద్యమం వినియోగం అనర్థాలకు కారణమని ఇంట్లో పెద్దలు, పాఠశాల్లో ఉపాధ్యాయులు ఓ వైపు చెబుతున్నా పెడచెవిన పెట్టే విద్యార్థులు ఏదో కొత్తదనం అంటూ అపరిచితులను నమ్మి వెళ్లి.. మోసపోయిన తరువాత కళ్ల తెరిస్తే మాత్రం లాభం ఏంటి. సోషల్ మీడియాలో పరిధి మించి వెళ్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని మరో ఘటన కూడా నిరూపించింది.

ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడి కోసం వెళ్లిన యువతిపై ఆ యువకుడు, అతని సోదరుడు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని మొత్తం  వీడియో తీసి జరిగిన దారుణాన్ని ఎవరికైనా చెబితే వీడియోను కూడా సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలో జరిగిన ఈ దారుణం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడ్ని సోనూగా గుర్తించారు.

బాధిత యువతిని ఓ హోటల్‌లో నిర్బంధించిన నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం సోనూ సోదరులు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణాన్ని వీడియో తీసిన నిందితుడు అనంతరం ఆమెను బెదిరిస్తూ, తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. తన కులాన్ని దాచిపెట్టి యువతితో స్నేహం చేసిన నిందితుడు, దీని గురించి ఆమెకు నిజం తెలియడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సోనూతోపాటు అతడి బంధువులు 10 మందిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ అజయ్ పాండే వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  rape  UP crime  Yogi Adityanath  UP rape  facebook  sexual assault  rape  gangrape  

Other Articles