Cyclone Pabuk to make landfall on 8 January తీరప్రాంతానికి పాబుక్ తుఫాన్ ముప్పు..

Cyclone pabuk imd issues yellow alert in andaman and nicobar islands

Andhra pradesh, telangana, Andaman and Nicobar Islands,Andaman Sea, Bay of Bengal, Cyclone pabuk, Cyclonic storm, Thailand, phethai, phethai cyclone, low temperatue in telangana, low temperature in andhra pradesh, 44 dead in telugu states, telugu states

A yellow alert has been sounded for the Andaman and Nicobar Islands as a cyclonic storm is moving towards the archipelago, the Home Ministry said on Saturday.

అలెర్ట్.. తీరప్రాంతానికి మరో ముప్పు.. పబుక్ వస్తొంది..

Posted: 01/05/2019 01:24 PM IST
Cyclone pabuk imd issues yellow alert in andaman and nicobar islands

ఫైతాన్, పెథాయ్ తుఫాన్లు విరుచుకుపడిన తరువాత తీరప్రాంతవాసులను మరో తుఫాను కలవరపరుస్తోంది. పెథాయ్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షం సంభవించి చేతికందాల్సిన పంటను నీటముంచి రైతుల కన్నీళ్లకు కారణమైంది. ఈ తుఫాను ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా కనిష్టస్థాయికి చేరాయి. తీరప్రాంత జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖలు పెథాయ్ దెబ్బ నుంచి కొలుకోకముందు మరో తుఫాను తీరప్రాంతవాసులను కలవరానికి గురిచేస్తోంది.

బంగాళాఖాతంలో మరో తుఫాను కేంద్రీకృతమైయ్యిందని, ఇది అండమాన్ నికోబార్ ద్వీపసమూహాల వైపు కదులుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవులకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం థాయ్ లాండ్ ను తాకిన పబుక్ క్రమంగా తన దిశను అండమాన్ నికోబాద్ దీపులవైపు మరల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

పబుక్ కారణంగా ఈ నెల 7 వరకు సముద్రం అలకల్లోలంగా మారిందని.. అంమాన్ ద్వీపాలు, అండమాన్ సముద్రంతో పాటుగా తూర్పుమధ్య, అగ్నేయ బంగాళాఖాతంలో కూడా సముద్రం ఉదృతంగా వుంటుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. ఈ క్రమంలో అండమాన్ నికోబార్ ద్వీపాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని కేంద్రహోంశాఖ సూచించింది.

మత్య్సకారులు చేపలకు వెళ్లవద్దని సూచించిన వాతావరణ కేంద్రం అధికారులు ఈ ప్రాంతంలో చేపట పట్టడాన్ని ఈ నెల 8 వరకు నిషేధించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించింది. పబుక్ తుపాను క్రమంగా పశ్చిమ, వాయువ్య దిశలపై కదిలి మయన్మార్ తీరానికి ఈశాన్య దిశలకు చేరకుని ఆ తరువాత క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ఆదివారం నుంచి 70 నుంచి 90 కీలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andaman and Nicobar Islands  Andaman Sea  Bay of Bengal  Cyclone pabuk  Thailand  

Other Articles