school-bus-falls-in-gorge-in-himachal-pradesh-7-killed స్కూల్ బస్సు బోల్తా.. ఏడుగురి దుర్మరణం

6 children driver killed as school bus falls into gorge in himachal pradesh

himachal pradesh accident, himachal pradesh school bus accident, sirmaur bus accident, school bus falls into gorge, bus tragedy in himachal, bus accident in himachal, crime

Seven people, including six schoolchildren, were killed and 12 injured on Saturday when a private school bus rolled down a deep gorge in Himachal Pradesh's Sirmaur district, police said.

హిమాచల్ లో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. ఏడుగురి దుర్మరణం

Posted: 01/05/2019 04:05 PM IST
6 children driver killed as school bus falls into gorge in himachal pradesh

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది, స్కూల్ బస్సు లోయలో పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ జిల్లాలో శనివారం (జనవరి 5) ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా.. రేణుకజి ప్రాంతంలో అదుపుతప్పి లోయలోకి జారిపోయింది. లోతైన లోయలో పడిపోవడంతో చిన్నారులంతా బస్సులో నలిగిపోయారు.

ఈ దుర్ఘటనలో మరో 12 మంది చిన్నారులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్‌ రామ్‌ స్వరూప్‌ (40)తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే మరణించారు. మరో ముగ్గురు విద్యార్థులు నహాన్‌ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా ఈ ప్రమాదంలో తమ ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల భాధ స్థానికులకు కూడా కన్నీళ్లపర్యంతం చేసింది.

లోయలోకి పడిపోవడంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది. సహాయ చర్యలు క్లిష్టంగా మారాయి. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకి తీసుకురావడం కష్టతరంగా మారిందని సిర్మౌర్ జిల్లా ఎస్పీ రోహిత్ మాల్పని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో మొత్తం 12 మంది విద్యార్థులలో 10 మంది విద్యార్థులను గుర్తించామని వారి పేర్లు వివరాలతో పాటు మృతుల వివరాలను కూడా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : school bus falls into gorge  Bus Accident  bus tragedy  ggorge  Himachal Pradesh  crime  

Other Articles