High court adjourns Prabas Guest House sieze case ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ కేసు: నీళ్లు నమిలిన రెవెన్యూ అధికారులు

High court slams revenue officials on prabhas guest house regularisation

Hero Prabhas, prabhas rayadurgam guest house, telangana government, High court, Telangana

High court adjourns Hero Prahas Guest House case to tomarrow after slaming Telangana revenue officials on regularisation.baahubali hero guest house was siezed by officials situated at rayadurgam, Seri Lingampally mandal of RangaReddy district.

ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ కేసు: నీళ్లు నమిలిన రెవెన్యూ అధికారులు

Posted: 01/02/2019 05:38 PM IST
High court slams revenue officials on prabhas guest house regularisation

తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సమరశంఖం పూరించిర హీరో ప్రభాస్.. పిటీషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణకు స్పీకరించి.. తెలంగాణ రెవెన్యూ అధికారులకు మెట్టికామలు వేసింది. తన గెస్ట్ హౌజ్ ను తెలంగాణ రెవెన్యూ అధికారులు అక్రమంగా సీజ్ చేశారని, ఇందుకు సంబంధించి తాను పెట్టుకున్న రెగ్యూలరైజేషన్ ధరఖాస్తును స్వీకరించిన అధికారులు తన నుంచి కోటి రూపాయల పైచిలుకు మొత్తాన్ని కూడా కట్టించుకున్నారని ప్రభాస్ తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన పిటీషన్ లో పేర్కోన్నారు.,

 కాగా, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రెవెన్యూ అధికారుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ప్రభాస్ దాఖలు చేసిన రెగ్యూలరైజేషన్ ధరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. రెగ్యులరైజేషన్ ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అని అధికారులను ప్రశ్నించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది పూర్తి వివరాలను రేపు కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు.

హీరో ప్రభాస్ కు చెందిన రాయదుర్గంలోని గెస్ట్ హౌజ్ ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంతో ప్రభాస్ న్యాయస్థానాన్ని అశ్రయించిన విషయం తెలసిందే. పాన్ మక్తా ప్రకారం తన గెస్ట్ హౌజ్ లో ఎలాంటి అక్రమాలు లేవని.. అయినా ముందు జాగ్రత్త చర్యగా తాను తన గెస్ట్ హౌజ్ భూమిని రెగ్యూలరైజేషన్ కోసం ఎల్ఆర్ఎస్ కూడా ధరఖాస్తు చేసుకున్నానని న్యాయస్థానానికి సమర్పించిన పిటీషన్లో పేర్కోన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles