Woman raped several times by mahant in Ayodhya ఆధ్యాత్మిక పాఠాలు పేరుతో ఆశ్రయం.. ఆపై దారుణం..

Woman devotee held hostage raped several times by mahant in ayodhya

Uttar Pradesh, UP Ayodhya, Ayodhya rape, mahant rape, temple priest rape, priest rape, priest Ayodya rape, mahant accused rape, Krishna Kantacharya, Ayodhya police, Varanasi woman, Uttar Pradesh, crime

Police in Ayodhya, Uttar Pradesh have arrested a mahant accused of holding a woman devotee hostage & raping her multiple times on the temple premises. The woman managed to escape & alert local law enforcement.

ఆధ్యాత్మిక పాఠాలు పేరుతో ఆశ్రయం.. ఆపై దారుణం..

Posted: 01/02/2019 04:11 PM IST
Woman devotee held hostage raped several times by mahant in ayodhya

ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించమని కోరిన ఓ భక్తురాలికి బలవంతంగా కామపాఠాలు నేర్పించి కటకటలాపాలయ్యాడు ఓ పండితుడు. కామి గాని వాడు మోక్షగామి కాడన్న నానుడి వంటపట్టించుకున్నాడో ఏమోగానీ.. దేవం గురించి ప్రవచనాలు చెప్పమంటే.. రాక్షసుడిగా మారి అమెపై అత్యాచారం చేశాడు. పవిత్రమైన ఆలయంలోనే కొన్ని రోజుల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తర్ ఫ్రదేశ్ లోని అయోధ్యలో జరిగిందీ ఘటన. భక్తురాలిపై  అతిదారుణంగా రేప్ చేసిన ‘కిరాతక’ పండితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న ఓ ఆలయంలో ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నాడు కృష్ణ కాంతాచార్య. శ్రీకృష్ణ పరమాత్ముడి లీలల గురించి భక్తుల ప్రవచనాల రూపంలో బోధిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలనే ఆసక్తితో వారణాసికి చెందిన ఓ 30 ఏళ్ల యువతి... ఆలయానికి వచ్చింది. డిసెంబర్ 24న ఆలయానికి వచ్చిన మహిళను కృష్ణ కాంతాచార్య... ఆశ్రమంలోనే కొన్నిరోజులు ఉండాల్సిందిగా చెప్పాడు.

దానికి సరేనని చెప్పి... అక్కడే బస చేసిందా మహిళ. ఆశ్రమంలోనే మహిళకు ఆశ్రయమిచ్చిన కృష్ణ కాంతాచార్య... ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. గుడి సన్నిధానంలోనే తనపై అతిదారుణంగా అఘాయిత్యం చేశాడని వాపోతూ పోలీసులకు సమాచారం అందించిందా మహిళ. మహిళ ఫోన్‌తో స్పందించిన పోలీసులు... ఆశ్రమంలోకి వెళ్లి యువతిని రక్షించారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించిన పోలీసులు... కృష్ణ కాంతాచార్యను అరెస్ట్ చేశారు. కృష్ణ కాంతాచార్య ఇలాగే ఆశ్రమంలోకి వచ్చే అనేక మంది భక్తురాళ్లను బంధించి, అత్యాచారం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles