Pawan Kalyan congratulates KCR on landslide victory కేసీఆర్ కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు..

Pawan kalyan congratulates kcr on landslide victory

pawan kalyan, janasena, Pawan Kalyan congrats KCR, Pawan congratulations letter, telangana elections results, telangana elections 2018, Telangana assembly elections, TRS, Telangana Politics, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan congratulates Telangana care taker Chief Minister KCR on his Landslide Victory in Telangana assembly Elections,

కేసీఆర్ కు పవన్ శుభాకాంక్షలు.. ఓటర్ల విజ్ఞత మళ్లీ రుజువైందిన్న జనసేనాని

Posted: 12/11/2018 07:59 PM IST
Pawan kalyan congratulates kcr on landslide victory

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తన ప్రభంజనాని చాటుకుని గతం కంటే మెరుగైన ఫలితాలతో విజయ దుఃధుభి మ్రోగించింది. గత పర్యాయం ఎన్నికలలో 63 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఈ సారి ఎన్నికలలో 88 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని తెలంగాణనాట తనకు తిరుగులేదని రుజువు చేసుకున్నారు. ఇక ఇవాళ వెలుడవిన ఫలితాలలో కారు జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఈ ఫలితాలు గులాబీ పార్టీలో ఫుల్ జోష్ నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

తాజాగా ఈ ఫలితాలపై జనసేన అధినేత, సినీనలుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావుతోపాటు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ పవన్ ఓ లేఖను విడుదల చేశారు. ‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది’అన్నారు.

‘తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు. ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  TRS  Telangana assembly Elections  andhra pradesh  politics  

Other Articles