cyclone pethai to hit coastal andhra ముంచుకోస్తున్న పెథాయ్ ముప్పు..

Cyclone pethai to hit coastal andhra

weather news, cyclone pethai, coastal andhra, heavy rain, pethai news, Rains in Hyderabad, Phethai cyclone effect, Cyclone Phethai. andhra pradesh, Telangana

After poor show of Northeast monsoon, hope for rain has revived again as Met Department said the well marked low pressure area over Bay of Bengal is likely to intensify into a cyclone and will cross Tamilnadu coast.

ముంచుకోస్తున్న పెథాయ్ ముప్పు.. హడలిపోతున్న తీరప్రాంతవాసులు

Posted: 12/15/2018 09:13 AM IST
Cyclone pethai to hit coastal andhra

కోస్తాంధ్రపై ప్రకృతి పగబట్టింది. తీరప్రాంతవాసులను హడలెత్తిస్తూ పెథాయ్ తుఫాను దూసుకొస్తుంది. తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోని తీరప్రాంతాలను మరోమారు కబళించేందుకు పెథాయ్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారితీరం దాటనుంది. దీనికి ఫెథాయ్‌ తుఫానుగా నామకరణం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను మచిలీపట్నం కేంద్రానికి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో ఏ ప్రాంతంలో తీరం దాటినా దాని ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పొంచి ఉన్న ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రాణనష్టం లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రభావిత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ముందస్తు చర్యలకు పూనుకుంటున్నారు.

పెథాయ్ తుఫాను పెను తుఫానుగా మారితే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 17వ తేదీ సాయంత్రానికి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తుఫాను దిశ మార్చకుంటే దక్షిణ కోస్తా వైపు అంటే మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముందని వారు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెటకు వెళ్లవద్దని అదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles