KCR promises to fullfill election promises కోటి ఎకరాలకు నీళ్లు, యువతకు ఉపాధి, అరోగ్య తెలంగాణే లక్ష్యం: కేసీఆర్

Telangana elections 2018 kcr promises to fullfill election promises

telangana elections results, care-taker Chief Minister, KCR, election promises, employment, healthy telangana, national politics, telangana elections 2018, Telangana assembly elections, TRS, jaggareddy, dk aruna, ponnala lakshmaiah, revanth reddy, Congress, Maha kutami, Telangana Politics

Telangana elections 2018: Telangana care-taker Chief Minister KCR assures people of Telangana to fulfill election promises.

కోటి ఎకరాలకు నీళ్లు, యువతకు ఉపాధి, అరోగ్య తెలంగాణే లక్ష్యం: కేసీఆర్

Posted: 12/11/2018 06:37 PM IST
Telangana elections 2018 kcr promises to fullfill election promises

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరిగినా ఎన్నికల్లో తాము విజయం సాధించడంతో అహంకారానికి పోకూడదని, గర్వ రాకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి, అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు తామిచ్చిన పలు ఎన్నికల హామీలను పూర్తి చేసేందుకు తాము కృతనిశ్చయంతో ముందుకుసాగుతామని అన్నారు. అయితే తెలంగాణ యువతలో తమకు అనుకున్న స్థాయిలో ఉద్యోగ కల్పన రాలేదని భావన నెలకొందని అన్నారు.

రానున్న కాలంలో ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ వీలైనంత వేగంగా భర్తీ చేస్తామని అన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలతో పాటు అటు ప్రైవేటు రంగంతో పాటు బహుళజాతి సంస్థల్లో కూడా యువతకు విరివిగా ఉద్యోగాలు లభించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. శనేశ్వరం వద్దని కాలేశ్వరాన్ని కోరుకున్న తెలంగాణ రైతులకు ధన్యవాదాలు చెప్పిన ఆయన రానున్న కాలంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

కంటి వెలుగు తర్వాత ఈఎన్టీ, డెంటల్ బృందాలు పల్లెల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. రైతులకు ఏ బాధ లేకుండా చేస్తామని, సస్యశ్యామల, శాంతియుత తెలంగాణను తయారు చేసుకుందామని, తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. దళిత, గిరిజన కుటుంబాల్లో పేదరికం పోవడానికి కచ్చితమైన చర్యలు తీసుకుంటామని, దరిద్రం అనేది ఎవరినైనా దహిస్తుందని, దానికి కులం, మతం అనే తేడాలేదని, ఇతర కులాల్లోని పేదలను కూడా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

చంద్రబాబుకు వందశాతం రిటన్ గిప్ట్ ఇస్తా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలుగజేసుకోవాలని, లక్షలాది మంది అక్కడి అభిమానులు తమను కోరుతున్నారని కేసీఆర్ అన్నారు. ఈ విషయమై తమకు ఫోన్లు, వాట్సాప్ మెస్సేజ్ ద్వారా ప్రజలు కోరుతున్నారని, తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే తమ అభిమతమని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి తమకు గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు, తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ వ్యంగ్యంగా అన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబు చెప్పారు. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్ కు లేదా? తప్పకుండా, తెలుగు ప్రజలు బాగుండాలని వందశాతం తాను కోరుతున్నానని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు లక్షకు పైగా ఫోన్లు వచ్చాయి. ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెస్సేజ్ లు బోలెడు వచ్చాయి. తమ వాళ్ల ఫోన్లు పగిలి పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తాను ఏదో సరదాగా చెప్పట్లేదని నిజాయతీగా చెబుతున్నానని అన్నారు. ‘మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి’ అని అడుగుతున్నారు. దేశ రాజకీయాలు బాగు చేసే క్రమంలో, తెలుగు ప్రజల గౌరవం పెరగాలనంటే కలిసి పనిచేయాలి..చేస్తాం. చంద్రబాబు వచ్చి మా దగ్గర పని చేశారు. నేను పోయి అక్కడ పనిచేయొద్దా? బర్త్ డే పార్టీకి గిఫ్ట్ ఇస్తే.. మళ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా? ఇవ్వమా? ఇవ్వకపోతే తమకు మర్యాద తెలియదని అనుకుంటారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇంకోపార్టీ దిక్కులేకనే కాంగ్రెస్ గెలుపు

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజు వెలువడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు మరో రాష్ట్రంలో బీజేపీ ఓటమి పాలు కావడంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయా పార్టీలపై వ్యాఖ్యలు చేశారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, అందుకు బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవడం రొటీన్ అయిపోయిందని అయన వ్యాఖ్యానించారు,

ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ పార్టీలు అక్కడ లేకపోవడమేనని అన్నారు. ఈక్రమంలో ఆయా పార్టీలు అవినీతి కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు చేసుకుంటున్నాయని, ఈ ఆరోపణలను ‘మనం విని, బఫూన్ కావాలి’ అని, ఇదో అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇటువంటి వాటి నుంచి దేశం బయటపడాలని, ఆ పద్ధతి పోవాలంటే, తెలంగాణలో ఏది అనుసరించామో, దేశమంతటా ఆ పద్ధతి  అనుసరించబడాలని అభిప్రాయపడ్డారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh