jaipal reddy slams kcr on revanth arrest ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డీ అరెస్ట్: జైపాల్ రెడ్డి

Former union minister jaipal reddy fires on cm kcr

s, jaipal reddy, kavitha, revanth reddy, P Narender Reddy, kcr, geetha, kondal reddy, TRS, Congress, Telangana PCC, Telangana PCC working President arrested, KCR rally, Telangana assembly elections, Telangana elections 2018, telangana politics

Telangana Congress Working President Revanth Reddy arrest is indicating the defeat of ruling TRS said former union minister S.Jaipal Reddy. He asked if the same is done with CM KCR daughter Kavitha, will he accept it.

‘‘పడకగదుల్లోకి పోలీసులను పంపడమే బంగారు తెలంగాణా.?’’

Posted: 12/04/2018 01:08 PM IST
Former union minister jaipal reddy fires on cm kcr

కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని అర్థరాత్రి హైడ్రామా మధ్య పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల కింద అరెస్టు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. తెలంగాణ చరిత్రలో ఇలాంటి దారుణం మునుపెన్నడూ జరగలేదని కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారుల ఇళ్లలోకి ఎలాంటి వారెంట్ లేకుండానే, తలుపులు పగలగొట్టి వెళ్లి పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడం.. కొడంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో బయోత్పాతాన్ని సృష్టించడంపై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తంచేశారు.

బంగారు తెలంగాణ అంటే పోలీసుల రాజ్యమా.? నిజాం కంటే నిరంకుశంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన తూర్పారబట్టారు. దీనికి వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ఉండటం వల్ల బంద్ కు పిలుపునిచ్చిన రేవంత్ ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాము బంద్ కు పిలుపునివ్వలేదని ఆయన తెలిపారు. బంద్ కు ఇచ్చిన పిలుపును విరమించుకున్నామని, కేవలం నిరసన కార్యక్రమాలను మాత్రమే చేపడతామని చెప్పామని అన్నారు.

రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు... మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలని... అది చేయకుండా బెడ్రూమ్ లోకి వెళ్లి, ఒక దొంగను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూతురు కవిత ఇంట్లోని బెడ్రూంలోకి నోటీసులు కూడా ఇవ్వకుండా వెళితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదేనా మీ పాలన తీరు.? ఇలాంటి వాటిని రాజ్యాంగం, సమాజం ఒప్పుకుంటుందా? అని నిలదీశారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అయన అరోపించారు. ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని జైపాల్ రెడ్డి దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : s.jaipal reddy  revanth reddy  Telangana PCC  KCR public meeting  CM KCR  KCR rally  telangana  politics  

Other Articles