Talasani saikiran reddy manhandles TDP car driver మంత్రి తలసాని కుమారుడి దాడిపై నిరసన

Tdp activists protest demanding action against talasani sai kiran reddy

Talasani srinivas yadav, sai kiran yadav, kuna venkatesh goud, TRS, gauri shankar goud, narasimha yadav, sanathnagar police station, telangana elections 2018, Telangana assembly elections, K Chandrashekar Rao, Congress, Maha kutami, Telangana Politics

TDP activists stage protest in front of sanathnagar policestation, alleging the action on care-taker minister talasani srinivas yadav son sai kiran yadav, for checking kuna venkatesh goud car and manhandling him.

ITEMVIDEOS: సనత్ నగర్ ఠాణా ఎదుట టీడీపీ కార్యకర్తలు అందోళన

Posted: 12/04/2018 12:04 PM IST
Tdp activists protest demanding action against talasani sai kiran reddy

అధికార పార్టీకి అదికారం దూరం అవుతుందన్న అందోళన వుందా.? అందుకనే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను అధికార బలంతో చక్రబంధనంలో బంధించి తమ ప్రచారాన్ని చేసుకుని.. పనులు చక్కబెట్టుకుంటుందా.? అన్న అనుమానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు రోజులు వున్న సమయంలో అధికార పార్టీ పోలీసులను వినియోగించుకుని ప్రత్యర్థి నేతలను హడలెత్తిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక మరికొందరు నేతల బంధువులు, కుటుంబసభ్యులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన హైదరాబాద్ రాజధాని నగరంలో చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సనత్‌నగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆపద్దర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌ యాదవ్‌ మరో అభ్యర్థి కుమారుడి కారు డ్రైవర్‌పై దాడి చేయడం చర్చనీయాంశమైంది.

సనత్‌నగర్‌ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌ కుమారుడు గౌరీశంకర్ గౌడ్‌ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న నర్సింహయాదవ్ తో పాటు అతని మిత్రులు కారులో జెక్ కాలనీ ప్రాంతంలో వెళ్తుండగా గమనించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్.. కారును నిలువరించాడు. వారు కారు దిగగానే కారును తనిఖీ చేయాలంటూ హల్ చల్‌ చేశారు. తనిఖీ చేసేందుకు ఏ అధికారం ఉందని ప్రశ్నించడంతో కూన వెంకటేశ్‌ కుమారుడి కారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడని కాంగ్రెస్‌, టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

కాగా, సాయికిరణ్ పై చర్యలు తీసుకోవాలని, టీడీపీ నేతలు సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంత్రి తలసాని కుమారిడిపై తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ సాయికిరణ్ ని అరెస్ట్‌ చేయాల్సిందేనంటూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట టీడీపీ, కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సనత్ నగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు స్వీకరించామని, విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles