Congress: France concealing facts on Rafale deal రిలయన్స్ కు రాఫెల్ డీల్.. తెరపైకి మోడీ పాత్ర: రాహుల్

Congress france concealing facts on rafale deal

congress, narendra modi, france, bharatiya janata party, manish tewari, defence, reliance, rahul gandhi, union goverment

After the French government and Dassault Aviation contradicted former President Francois Hollande's claim in choosing Indian industrial partners in the multi-million dollar Rafale jet deal, the Congress on Saturday said the French statement "conceals more than it reveals".

రాఫెల్ డీల్: దేశద్రోహానికి పాల్పడిన మోడీ: రాహుల్

Posted: 09/22/2018 10:57 AM IST
Congress france concealing facts on rafale deal

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు ప్రధాని నరేంద్రమోడిని టార్గెట్ గా చేసుకుని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లుగా నీతివంతమైన పాలన, నిజాయితీ, పారదర్శక పాలన అంటూ ఊదరగోట్టిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం.. రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని తాను పదే పదే ఆరోపిస్తున్నా.. ఈ విషయంలో సిబీఐ దర్యాప్తుకు ఎందుకు వెనకాడుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. ప్రజలకు చెప్పేందుకే సూక్తులు, నీతులు.. కానీ తాము మాత్రం వాటికి దూరం అన్నట్లుగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరువుందని విమర్శించారు.

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సర్వీస్ ప్రొవైడర్ గా రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేయడంలో తమ పాత్ర ఏమీ లేదని... రిలయన్స్ డిఫెన్స్ పేరును భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలాండ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. విపక్షాలన్నీ మోదీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై.. రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలోనే రాఫెల్ అతి పెద్ద కుంభకోణమంటూ ఇప్పటికే విమర్శిస్తున్న రాహుల్... దేశాన్ని మోదీ మోసం చేశారంటూ మండిపడ్డారు.

మోదీ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు తానే స్వయంగా వేల కోట్ల విలువైన డీల్ ను అనిల్ అంబానీకి మోదీ అప్పగించారని రాహుల్ విమర్శించారు. రాఫెల్ ఒప్పందం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టినందుకు ఫ్రాంకోయిస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఫ్రాంకోయిస్ వ్యాఖ్యలతో అనిల్ అంబానీకి మోదీనే స్వయంగా డీల్ ను అప్పగించారనే విషయం స్పష్టమయిందని చెప్పారు. దేశ ద్రోహానికి పాల్పడ్డ మోదీ... దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారని విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  narendra modi  france  defence  reliance  rahul gandhi  union goverment  

Other Articles