Tdp mla welcomes jagan in a indifferent manner జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే వినూత్న స్వాగతం

Ruling party mla kolla lalitha welcomes ys jagan in a indifferent manner

YS Jagan Mohan Reddy, YS jagan, YSR congress, vizianagaram, shrungavarapu kota, kolla lalitha, flexis, allegation, ashok gajapathi raju, TDP, formen union minister, andhra pradesh, politics

After the opposition leader YS Jagan starts his 267th day padayatra and ready to enter northern andhra district vizianagaram, the s kota ruling mla kolla lalitha welcomes him with flexis

విజయనగరంలో జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే వినూత్న స్వాగతం

Posted: 09/22/2018 11:38 AM IST
Ruling party mla kolla lalitha welcomes ys jagan in a indifferent manner

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా సుమారు 267 రోజులగా ఏకబిగిన పాదయాత్ర చేస్తున్న విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు విజయనగరంలో.., అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అహ్వానాలు పలుకుతున్నారు. అదేంటి స్వాగత కార్యక్రమాలు పర్యవేక్షించాల్సింది ఆ జిల్లా పార్టీ ఇంచార్జులు.. సదరు నియోజకవర్గ సమన్వయకర్త కదా.? మరీ టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు స్వాగతం పలుకుతున్నారు.. పార్టీ మారుతున్నారా.? అన్న సందేహాలు అవసరం లేదు.

ఎందుకంటే జగన్ కు స్వాగత ఫ్లెక్సీలు కడుతున్న అధికార టీడీపీ ఎమ్మెల్యే ఆయనను పరోక్షంగా టార్గెట్ చేసే క్రమంలోనే ఈ స్వాగత తోరణాలు కట్టిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే. ప్రస్తుతం విశాఖపట్టణంలో పాదయాత్ర చేస్తున్న జగన్.. ఇక ఆ జిల్లా నుంచి విజయనగరంలో జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో శృంగవరపు కోట అధికార టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత.. జిల్లాలో అడుగుపెట్టీ పెట్టకముందే ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జగన్ రాకతో వైసీపీ పార్టీ నేతలు పెట్టించే ఫ్లెక్సీలతో ఆయా ప్రాంతం మొత్తం ఆకుపచ్చ వర్ణంగా మారుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో అక్కడి జనసమీకరణను చూసి జగన్.. ప్రభుత్వంపై విమర్శలను గుప్పిస్తూ.. ప్రజలకు నీతిసూక్తులను వల్లెవేస్తున్నారని విమర్శించిన కోళ్ల లలిత.. గతంలో తనపై వచ్చిన విమర్శలను, అరోపణలను ప్రముఖంగా ప్లెక్లీలలో ప్రచురించి వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ తో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణల అవినీతి అక్రమాలపై గతంలో పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను శృంగవరపుకోటలో ఫ్లెక్సీలుగా ముద్రించి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు.

అంతేకాదు, వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లపై బొత్స గతంలో చేసిన ఆరోపణలను కూడా ఫ్లెక్సీల్లో ముద్రించారు. అప్పుడు ఉప్పు నిప్పులా వున్న నేతలు.. ఇప్పుడెలా అల్లం బెల్లంగా మారారని అమె ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతిరాజు శృంగవరపు కోటకు చేరుకుని ఈ ఫ్లెక్సీలను పరిశీలించారు. పాదయాత్రలో నీతి వాక్యాలు వల్లిస్తున్న జగన్ బండారం వీటితో బయటపడుతుందని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS jagan  YSR congress  vizianagaram  s kota  kolla lalitha  flexis  andhra pradesh  politics  

Other Articles