ఈవ్ టీజింగ్, అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసే పోకిరీలను కటకటాల వెనక్కి నెట్టి.. వారికి తామున్నామన్న భరోసాను కల్పించేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కింది స్థాయి సిబ్బందిపైనే వుంటుంది. అలాంటి బాధ్యతలను నిర్వహిస్తున్న ఓ దిగువస్థాయి సిబ్బంది.. తన వంటిపై ఖాకీ దుస్తులు ఉన్నాయన్న సోయి కూడా మర్చిపోయి మరీ ఏం చేస్తున్నాడో చూస్తే.. అవేశం కట్టలు తెంచుకోకతప్పదు.
బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో భాగంగా ఉండి, మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన ఓ హోమ్ గార్డు, విధులు నిర్వహిస్తూ, తనలోని కామాంచకు తెరలేపాడు. కొచ్చిలో అత్యంత రద్దీగా వుండే తివారాలో ఓ చర్చి ముందు వీధిలో విధులు నిర్వహిస్తున్న శివకుమార్ అనే హోమ్ గార్డు, అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించగా, అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో దీన్ని తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.
దీంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, సదరు హోమ్ గార్డు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలమక్కరాకు చెందిన శివకుమార్ వయసు 58 సంవత్సరాలు కాగా, తన మనవరాళ్ల వయసులో ఉండి, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థినులను కూడా వదల్లేదు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, సీటి పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more