netzens ask modi to speak on lynching, blackmoney ప్రధాని మోదీజి.. ఈ పంద్రాగస్టున వీటిపై ప్రసంగిస్తారా..

Netzens suggest pm modi to speak on black money lynching women protection

Independence Day, Narendra Modi, Red Fort, Independence Day Speech, lynching, black money, protection of women, pollution, solar power, supari, chaiwala PM, politics

In a routine excise before Independence day, Prime Minister Narendra Modi asks his followers to share their ideas and thoughts for his speech on forth comming Independence day.

ప్రధాని మోదీజీ.. నల్లధనం, మూకదాడులపై ప్రసంగించండీ..!

Posted: 07/31/2018 04:12 PM IST
Netzens suggest pm modi to speak on black money lynching women protection

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గతానికి భిన్నంగా తనకు అత్యధిక మంది దేశప్రజలు సూచించిన అంశాన్ని తీసుకుని దానిపై అనర్ఘళంగా మాట్లాడేసి.. దేశప్రజలను గత నాలుగేళ్లుగా మంత్రముగ్దుల్ని చేస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. అయితే గత నాలుగు పర్యాయాలకు ఈ పర్యాయానికి మాత్రం తేడా అప్పుడే కనిపించింది. నమో మంత్రంతో దేశమంతా సమ్మోహనమైన నాలుగేళ్ల క్రితం నుంచి.. నేటి పంద్రాగస్టు వచ్చే సరికి దేశప్రజల్లో కొంతమార్పు మాత్రం కనబడుతుంది.

ఈ సారి పంద్రాగస్టున ఐదో పర్యాయం ఎర్రకోట నుంచి ప్రసంగం చేయనున్న ప్రధాని.. గత నాలుగు పర్యాయాల మాదిరిగానే ఈ సారి కూడా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను ఏం మాట్లాడాలో చెప్పండి అంటూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ‘పంద్రాగస్టు ప్రసంగంలో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నారు. మీ సలహాలు, సూచనలు నరేంద్రమోదీ యాప్‌ ద్వారా నాతో పంచుకోండి. మీ విలువైన అభిప్రాయాల కోసం నేను ఎదురుచూస్తుంటాను’ అని ప్రధాని మోదీ ఇవాళ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ఇవాళ ఉదయం మోదీ ఈ ట్వీట్‌ చేయగా.. కొద్ది సేపట్లోనే వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. అయితే ఈ సారి వచ్చిన సలహాల్లో బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సంకటంగా పరిణమించిన నల్లధనం, మూకదాడులు, మహిళల రక్షణపై మాట్లాడాలని నెట్ జనులు ప్రధానికి సూచించారు. ఇక మరికోందరు కాలుష్య నియంత్రణపై మాట్లాడాలని సలహాఇచ్చారు. ప్రధాని ట్వీట్ చేసిన వెనువెంటనే నెట్ జనులు ఈ అంశాలపై మాట్లాడాలని కోరుతూ ఆయనకు యాప్. ట్విట్టర్ లో పోస్టు చేశారు.

‘ప్రధాని మోదీ జీ.. కాలుష్య నియంత్రణ గురించి మాట్లాడండి. ఇది మన దేశంలో పెద్ద సమస్యగా మారింది’, ‘నల్లధనం గురించి మాట్లాడండి’ అని, మూకదాడుల గురించి మాట్లాడండి’, ‘మహిళల రక్షణ గురించి మాట్లాడండి’ అని నమో యాప్‌, మోదీ వెబ్‌సైట్లలో కామెంట్లు పెడుతున్నారు. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయడం ఇది ఐదోసారి కావడంతో ఏ అంశాన్ని ఎంచుకుంటారన్న అసక్తి కూడా వుంది. అయితే కొందరుమాత్రం మోదీ హత్యకు కుట్ర అంశంపై మాట్లాడండీ అంటూ కొందరు.. ఛాయ్ వాలా పీఎం వద్దనుకున్న అంశంపై మాట్లాడాలని వినతలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles