nandyal bomb blast kills three నంద్యాలలో బాంబు విస్పోటనం.. ముగ్గురు మృతి..

Bomb explosion at nandyal kills three brothers

bomb blast, bomb explosion, joharapuram, realtors, jampala brothers, ASI, survey, kotla suryaprakash reddy, gopinath jetty, nandyal checkpost, nandyal, kurnool, crime

Bomb blast near Nandyal check post in Kurnool District on Tuesday. The explode kills three brothers of a family. Police investigating the case. one person injured in this accident is undergoing treatment in hospital.

నంద్యాలలో పేలిన బాంబు.. ముగ్గురు అన్నదమ్ముల మృతి..

Posted: 07/31/2018 03:22 PM IST
Bomb explosion at nandyal kills three brothers

కర్నూలు నగరం ఒక్కసారిగా ఉలిక్కపడింది. జిల్లాలోని ప్రధాన పట్టణం నంద్యాలలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు మరణించడంతో నంద్యాల పరిసరాల్లో విషాదం చోటుచేసుకుంది. నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు.

కర్నూలు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పెరుప్రఖ్యాతులు సంపాదించిన జంపాల కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి ఈ దుర్ఘటనలో మరణించడం అటు నంద్యాలతో పాటు ఇటు కర్నూలు నగరంలోనూ విషాధఛాయలు అలుముకున్నాయి. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు నగర శివారులో రూ.20కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు.

దీనికి సంబంధించి ఇవాళ పొలాన్ని సర్వే చేయించాలని భావించారు. దీని నిమిత్తం మల్లికార్జున్, రాజశేఖర్లకు బంధువయిన ఏఎస్సై జంపాల శ్రీనివాసులు, సర్వే డిపార్ట్‌మెంట్‌ డ్రైవర్‌ సుధాకర్‌ తో పాటుగా పోలం వద్దకు చేరుకున్నారు. వీరంతా భూమిని సర్వే చేయిస్తున్న సమయంలో కూలీలు చెత్తను ఓ చోటికి పోగుచేసి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మల్లికార్జున, రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, సుధాకర్‌ తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాగా, చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న జంపాల కుటుంబసభ్యులు, బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటన కర్నూలు నగరంలో కలకలం రేపింది. జంపాల కుటుంబీకులకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. అందరితోనూ మంచిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మృతులకు కుటుంబసభ్యులను పరామర్శించారు.

కర్నూలు జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి, డీఎస్పీ యుగంధర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ ప్రాంతంలోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఎవరైనా అక్కడ బాంబులను దాచారా? లేక గతంలో ఎప్పుడో పెట్టిన పేలుడు పదార్థాలా.? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bomb blast  joharapuram  realtors  jampala brothers  ASI  survey  nandyal  kurnool  crime  

Other Articles