Man lies on railway track in suicide attempt రైలు పట్టాలపై పడుకుని.. తోటివారిని కంగారుపెట్టి..

Man lies on railway track in suicide attempt in kurla of maharashtra

Mumbai, Maharashtra, Suicide Attempt, Kurla railway station, security personnel, Railway Protection Force (RPF), narendra dameji khattar, crime

After getting upset over family issues, a 54-year-old man attempted to commit suicide at Mumbai's Kurla railway station, who suddenly jumped off and lied on the railway track.

ITEMVIDEOS: రైలు పట్టాలపై పడుకుని.. తోటివారిని కంగారుపెట్టి..

Posted: 07/31/2018 05:03 PM IST
Man lies on railway track in suicide attempt in kurla of maharashtra

ముంబయిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని క్షణాల్లో ప్రతిస్పందించిన సహచర ప్రయాణికుడు అతడ్ని ప్రాణాలతో రక్షించాడు. ఈ ఘటన ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. రైలు వస్తున్న విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన ప్రయాణికులు వెంటనే ప్లాట్ ఫాం మీద నుంచి కిందికి దూకి అతడిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీజువల్స్ సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తమయ్యాయి. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అదికాస్తా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

నరేంద్ర దామాజీ కొటెకర్ (54) అనే వ్యక్తి ముంబైలోని కుర్లా రైల్వేస్టేషన్ కు మధ్యాహ్నం సమయంలో చేరుకున్నాడు. స్థానికంగా సెక్యూరిటీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ భారాన్ని మోయలేక కుంగిపోయాడు. ఆత్మహత్యే శరణ్యం అనుకున్న ఆయన.. రైల్వే స్టేషన్ కు చేరుకుని కొద్దిసేపు నిరీక్షించాడు. సరిగ్గా రైలు వస్తుందని గమనించిన నరేంద్ర దామాజీ ఫ్లాట్ ఫాం దిగి వచ్చి పట్టాలపై పడుకున్నాడు. దామాజీ అకస్మాత్తుగా పట్టాలపై పడుకోవడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్పందించారు.

రైలు దూరంగా వుందని గమనించిన ప్రయాణికులు.. వెంటనే పట్టాలపైకి దూకి దామాజీ వద్దకు చేరుకుని అతన్ని ఎత్తుకుని ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చారు. ఇదందా నిర్ధేశిత రైలు పట్టాలపై వచ్చే లోపు చేసేసి.. దామాజీని ఆత్మహత్యకు గల కారణాలను అరా తీశారు. ఈలోగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. నరేంద్ర దామాజీ కుటుంబీకులకు ఈ సమాచారం అందించిన పిమ్మట, బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబసభ్యులకు అతడ్ని అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles