filmmaker drowns during photoshoot వాటర్ ఫాల్స్ లో కాలుజారిపడి.. యంగ్ డైరెక్టర్ మరణం..

Film director santhosh shetty drowns during photoshoot

Ermayi Falls, Ujire water falls, Santosh Sheety Kateel, Director, gandhada kudi, chandan van,, cmcm, sandal wood, Belthangady, photo-shoot, karnataka, movies, entertainment

Budding film director Santosh Shetty Kateel drowned at Ermayi Falls in Ujire, Belthangady taluk of karnataka, Santosh was wearing a specially designed costume, accidentally slipped into the falls while he and his team were there for a photo-shoot.

వాటర్ ఫాల్స్ లో కాలుజారిపడి.. యంగ్ డైరెక్టర్ మరణం..

Posted: 05/31/2018 12:18 PM IST
Film director santhosh shetty drowns during photoshoot

సినిమా దర్శకుడిగా అడుగుపెట్టిన అనతికాలంలోనే అన్నివర్గాల ప్రేక్షకులతో మరీ ముఖ్యంగా చిన్నపిల్లల అదరాభిమానాలను చూరగోన్న వర్ధమాన దర్శకుడు సంతోష్ శెట్టి మరణం శాండిల్ వుడ్ లో విషాదాన్ని నింపింది. దర్శకుడు సంతోష్ శెట్టి మరో నలుగురితో కలిసి నిన్న ఉదయం దక్షిణ కన్నడలోని బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ వాటర్ ఫాల్స్ కు షూటింగ్ నిమిత్తం చేరుకున్నారు.  తన తాజా పిల్లల చిత్రం గన్ధద కుడి, చందన్ వాన్ చిత్రం ఫోటో షూట్ కోసం ఇక్కడకు వచ్చారు.

అయితే వారు ఫోటో షూట్ కోసం నీళ్లల్లోకి వెళ్తుండగా, స్థానికుడైన సురేంద్ర అనే వ్యక్తి నీళ్లు అధికంగా వున్నాయని, ప్రవాహం కూడా పెరుగుతుందని వారిని వారించాడని పోలీసులు తెలిపారు. అయితే అతని హెచ్చరికలను లక్ష్యపెట్టని చిత్ర యూనిట్ నేరుగా నీళ్లలోకి దిగి ఫోటో షూట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో రోబోలా కనిపించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన లోహదుస్తులను ధరించిన సంతోష్ శెట్టి కాలుజారి నీళ్లలో పడిపోయి సుమారు 10 నుంచి పదిన్నర మధ్య కొట్టకుపోయాడు. కాగా, సుమారు 12.30 గంటలకు ఆయన బౌతికఖాయాన్ని గుర్తించిన సురేంద్ర తమకు సమాచారం అందించాడని పోలీసులు తెలిపారు.

అనుమతులు లేకుండా వాటర్ పాల్స్ ప్రాంతంలో షూటింగ్ కు వచ్చినందుకు, ఫోటో షూట్ తీసినందుకు గాను మిగిలిన నలుగురిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304ఎ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యానిమేషన్ పట్టభద్రుడైన సంతోష్ పలు టీవీ ఛానెళ్లలో పనిచేసిన తరువాత తాను స్వయంగా చిన్నపిల్లల చిత్రాలను రూపోందించాలని చిత్రరంగంలో ప్రవేశించాడు. తన తాజా చిత్రం కూడా దాదాపుగా 90శాతం పూర్తైందని చిత్ర నిర్మాణవర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles