Shiv Sena says EC is 'tawaif' of BJP కేంద్ర ఎన్నికల సంఘంపై శివసేన ఘాటు విమర్శలు

Cec democracy mistress of those in power shiv sena

voter verified paper audit trails (vvpats), BJP, by-polls, heat wave, Electronic Voting Machines, Election Commission, tawaif, mistress, Shiv Sena, Sanjay Raut, Palghar, Bhandara-Gondia, Maharastra, politics

Two days after the controversy broke out over the malfunctioning of the EVMs during Monday’s by-polls, the Shiv Sena slammed the Election Commission (EC), calling it a ‘tawaif’ (mistress) of a political party.

కేంద్ర ఎన్నికల సంఘంపై శివసేన ఘాటు విమర్శలు

Posted: 05/31/2018 11:30 AM IST
Cec democracy mistress of those in power shiv sena

కేంద్ర ఎన్నికల సంఘంపై శివసేన పార్టీ ఘాటు విమర్శలు చేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం బీజేపీకి ఉంపుడుగత్తెలా వ్యవహరిస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గత కొన్నేళ్లుగా కేంద్రంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వుంపుడుగత్తెగా మారిపోయిందని తీవ్రస్థాయిలో ఆరోపించింది. ఎన్నికల సంఘం, దాని యంత్రాంగం అన్నీ అధికారంలో ఉన్న వారికి ఊడిగం చేస్తున్నాయని అన్నారు. అయితే గత నాలుగేళ్లుగా ఈ ఊడిగం వ్యవహారం ప్రజలందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా వుండటమే కాకుండా.. హద్దుమీరి మరీ వ్యవహరిస్తుందని శివసేన అక్షేపించింది.

మహారాష్ట్రలోని ఇటీవల జరిగిన రెండు పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో ఈ విషయం మరోమారు రాష్ట్ర ప్రజలకు అర్థమైందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అరోపించారు. మరీ ముఖ్యంగా పల్ఘర్ లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, ఈవీఎంలు, వీవీపాట్ మిషన్లు సరిగా పనిచేయకపోవడానికి అదే కారణమన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేయడం ఎన్నికల కమిషన్ అలవాటుగా మార్చుకుందని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ నేతలు ఫల్ఘర్ నియోజకవర్గాల్లో బీజేపి నేతలు ఓటర్లు డబ్బులు పంచడాన్ని రెడ్ హ్యండెండ్ గా పట్టుకున్నా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని.. ఇదే దేశవ్యాప్తంగా జరుగుతుందని అయన అరోపించారు. కాగా సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సీనియర్ నాయకులు అయివుండి ఏకంగా ఎన్నికల కమిషన్ పై అత్యంత జాగ్రత్తగా వ్యాఖ్యలు చేయాల్సిన నేత.. ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని పేర్కొంది. ఓ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న వ్యక్తి ఎన్నికల సంఘంపై అభాండాలు వేయడం సరికాదని హితవు పలికింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles