Congress wins big.. Opposition unity dents BJP ఉప ఎన్నికలలో బీజేపికి ఎదురుగాలి.. సత్తా చాటిన విపక్షాలు

Set back to bjp in by polls opposition on upper hand

By Elections, by-polls, Congress, BJP, India, Loksabha, Assembly, kairana, Palghar, Bhandara-Gondia, Maharastra, maharastra, nagaland, bihar, jharkand, election results, opposition parties, politics

The Lok Sabha seats which went to by-elections are : Palghar and Bhandara-Gondiya in Maharashtra; the politically-crucial Kairana Lok Sabha constituency in Uttar Pradesh, and Nagaland parliamentary constituency.

ఉప ఎన్నికలలో బీజేపికి ఎదురుగాలి.. సత్తా చాటిన విపక్షాలు

Posted: 05/31/2018 01:10 PM IST
Set back to bjp in by polls opposition on upper hand

దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన ఉపఎన్నికల ఎన్నికల ఫలితాల్లో కేంద్రంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో వున్న బీజేపి పార్టీకి ఎదురుగాలి వీచింది. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అవలంభిస్తున్న విధివిధానాలపై ఓటర్లు తమ తీర్పును వెలువరించారు. దీంతో మూడు సిట్టింగ్ స్థానాలలో బీజేపి పార్టీ కేవలం ఒక్కస్థానంలోనే గెలుపొందింది. ఈ ఉపఎన్నికలకు ముందే అనూహ్యంగా పార్లమెంటులో మైనారిటీలో పడిన భారతీయ జనతాపార్టీ.. గెలుపుకోసం తీవ్రంగానే శ్రమించినా వెనుకంజలో ఉంది.

వివిధా కారణాలతో ఖాళీగా వున్న నాలుగు లోక్‌సభ, 10 శాసన సభ స్థానాలకు ఈ నెల 28న ఉపఎన్నికలు జరిగాయి. కాగా ఇవాళ వాటి ఫలితాల కోసం అధికారులు కౌంటింగ్ చేపట్టారు. ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాటు చేసిన అధికారులు ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ను ప్రారంభించారు. కౌంటింగ్ లో నాలుగు లోక్ సభ స్థానాల్లో మూడు స్థానాల్లో బీజేపీ వెనుకబడి ఉండగా, కేవలం మహారాష్ట్రలోని పల్ఘర్ స్థానంలో మాత్రం బీజేపి ముందంజలో వుంది. ఇక నాగాలాండ్ లో బీజేపికి మిత్రపక్షమైన ఎన్డీపిపి అభ్యర్థిని విజయం వరించింది.

పార్లమెంటు స్థానాలు:-
*మహారాష్ట్రలోని పాల్ఘర్ స్థానంలో 29,572 ఓట్ల మెజారిటీతో బీజేపి గెలుపు
*మహారాష్ట్రలోని భంగారా గొండియా స్థానంలో బీజేపి అభ్యర్థిపై ఎన్సీపీ అభ్యర్థి ఘనవిజయం
*ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక కైరానా లోకసభ స్థానంలో ఎస్పీ, బీఎస్సీ, కాంగ్రెస్ బలపర్చిన అర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ ఘనవిజయం
*నాగాలాండ్ లోక్ సభ స్థానంలో బీజేపి మిత్రపక్షమైన ఎన్డీపీపీ పార్టీ విజయాన్ని అందుకుంది.

అసెంబ్లీ స్థానాలు:-
* కర్ణాటక: ఆర్ఆర్ నగర్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరతన్‌ ప్రత్యర్థి బీజేపి అభ్యర్థిపై 41 వేల మెజార్టీతో ఘనవిజయం.
* మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మియాని డి శిరా విజయం
* పంజాబ్ లోని షాకోట్ అసెంబ్లీలో కాంగ్రెస్ తన జెండాను పాతింది.
* మహారాష్ట్రలోని పాలూస్ కడెగావ్ నియోజకవర్గం కాంగ్రెస్ కైవసం
* బిహార్ జోకిహట్‌ అసెంబ్లీలో ఆర్జేడీ అభ్యర్థి ఘనవిజయం. తేజస్వీ నేతృత్వంలో ఇది అర్డేడికి మూడో విజయం.
* ఉత్తరప్రదేశ్ లోని నూర్ పూర్‌ అసెంబ్లీలో ఎస్పీ అభ్యర్థి నయీముల్‌ హసన్‌ విజయం. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపి.
* కేరళలోని చెన్‌గన్నూర్‌ స్థానాన్ని నిలబెట్టుకున్న సీపీఎం. ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి సాజి చెరియన్‌ 20,956ఓట్లతో గెలుపు.
* ఉత్తరాఖండ్ లోని థరాలి అసెంబ్లీ స్థానాన్ని బీజేపి నిలబెట్టకుంది.
* పశ్చిమ బెంగాల్ లోని మహేష్తలా అసెంబ్లీలో సత్తా చాటిన తృణముల్.. భారీ అధిక్యంతో విజయం
* ఝార్ఖండ్‌లోని సిల్లి అసెంబ్లీలో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీ అభ్యర్థి సీమా దేవి మహతో విజయం.
* గోమియా అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకున్న జేఎంఎం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : By Elections  by-polls  Congress  BJP  India  Loksabha  Assembly  kairana  maharastra  nagaland  election results  

Other Articles