Navayuga takes up Polavaram works పోలవరానికి గడ్కరీ గ్రీన్ సిగ్నల్.. నవయుగకు పట్టం..

Navayuga takes up polavaram spillway spill channel works

Polavaram, Navayuga, Chandrababu, transstroy, cm, nitin gadkari, union minister, spill way, channel works, vijayawada, green signal, delhi

CM Chandrababu said that Navayuga company will take over the works at the Polavaram project site from the first week of February as per the agreement done in delhi in the presence of Union Minister Nitin Gadkari.

పోలవరానికి గడ్కరీ గ్రీన్ సిగ్నల్.. నవయుగకు పట్టం..

Posted: 01/30/2018 07:23 PM IST
Navayuga takes up polavaram spillway spill channel works

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గత కొద్ది నెలలుగా నెలకొన్న సందిగ్ధత మొత్తానికి క్లియర్ అయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణం, కాంక్రీటు, స్పిల్‌ ఛానల్‌ పనులను ఆయన పచ్చ జెండాను ఊపారు. అయితే ఈ పనులను పాత ధరలకే కొత్త గుత్తేదారుకు అప్పగించే అంశంపై జరిగిన సమావేశంలో నవయుగ కంపెనీకి పనులను అప్పగిస్తూ కొత్తగా ఒప్పందాలను చేసుకున్నారు.

ఈ విషయమై కేంద్రమంత్రి రెండు గంటలపాటు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ, జలసంఘం అధికారులతో భేటీ అనంతరం మంత్రి గుత్తేదార్లతో కాసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నవయుగ, ట్రాన్స్‌ట్రాయ్‌ గుత్తేదారు సంస్థల్లో వేటికి ఈ ప‌నులు  అప్పగించే అంశంపై చర్చించారు. పోలవరం ప్రధాన గుత్తేదారుగా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ఇప్పటివరకు అనుకున్నవిధంగా నిర్దిష్ట సమయంలో పనులు పూర్తిచేయని నేపథ్యంలో ఈ పనులను నవయుగకు అప్పగించాలని సమావేశంలో మంత్రి నిర్ణయం తీసుకున్నారు.

అయితే నిర్మాణ పనులను పోందిన నవయుగ కంపెనీకి కూడా పలు షరతులను విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని సబ్ కాంట్రాక్టు పద్దతిన పనులను అప్పగించారు. ఇక దీనికి తోడు పాత ధరలతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని కూడా కేంద్రమంత్రి పెట్టిన షరతుకు నవయుగ నిర్మాణ సంస్థ అంగీకారం తెలపడంతో ఒప్పందాలు చేసుకున్నారు. నవయుగ కంపెనీకి స్పిల్‌వే, ఛానల్‌ పనుల్ని పూర్తిచేసేందుకు నిర్ణీత గడువును ఇవ్వడంతో పాటు అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకొనేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles