Total lunar eclipse, super blue blood moon today 150 ఏళ్ల తరువాత ఇవాళ సుదీర్ఘ చంద్రగ్రహణం..

Lunar eclipse 2018 super blue blood moon india

super blue blood moon, super blood moon 2018, super blue moon 2018, timings for super moon india, india how to watch super moon, lunar eclipse 2018, lunar eclipse india, lunar eclipse 2018 in india

Total lunar eclipse 2018: Super blue blood moon 2018 takes place on January 31 and coincides with a lunar eclipse as well

సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం.. ఎవరిపై ఎలాంటి ప్రభావం..

Posted: 01/31/2018 08:41 AM IST
Lunar eclipse 2018 super blue blood moon india

సూర్యుడు, భూమి, చంద్ర గ్రహాలు భ్రమణాలు చేస్తూ.. ఈ మూడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే భూమి చంద్రగ్రహాలకు మధ్యన రాహు గ్రహం వచ్చి చంద్రుడ్ని మింగేస్తుందని అప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుందని వేదపండితులు, జోతిష్యులు చెబుతుంటారు. సూర్యుడు, భూమి ఎప్పుడూ ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు.

ఈ క్రమంలో సూర్య, చంద్రుల మధ్యలో భూమి వచ్చిన రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంటుందన్నది సైన్స్ చెబుతున్న వాస్తవం. అయితే సైన్స్ చెప్పేందుకు ముందు మన జ్యోతిష్యులు రాహు గ్రహ స్యూర్య చంద్రులను మింగేస్తాయని, తద్వారా గ్రహణాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఈక్రమంలో భూమి ఛాయ చంద్రబింబాన్ని పూర్తిగా కప్పేస్తే, సంఫూర్ణ గ్రహణమనీ, కొంత భాగాన్ని కప్పేస్తే పాక్షిక గ్రహణమని సైన్స్ చెబుతుండగా, అది రాహుగ్రహమని జ్యొతిష్యులు వాదిస్తున్నారు.

ఇవాళ పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటక రాశిలో సాయంత్రం 5:18 మొదలు రాత్రి 8:41 వరకు కర్కాటక, సింహలగ్నాలలో రాహు గస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది. సా. 6:22 గంటలకు సంపూర్ణ స్థాయిలోకి ప్రవేశించే గ్రహణం, రాత్రి. 7:38 తరువాత విడుపు దశకు చేరుతుంది. రాత్రి 8.40 నిమిషాలకు సంపూర్ణ విడుపు జరుగుతుంది. మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు. ఈ గ్రహణం ఇండియా సహా, ఆసియా, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది.

ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం:

హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు మూడు బోజన నియమాలు పాటించడంతో పాటు స్నానం, దానం విషయంలో హైందవులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుందని జ్యోతిష్యులు పేర్కోంటున్నారు. అయితే దీనిని హేతువాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు రాహుగ్రహమే లేదని, లేని గ్రహాలు ప్రజలపై ఎలా ప్రభావం చూపుతాయని ప్రశ్నిస్తున్నారు.

నీడను చూపించి జ్యోతిష్యులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి డబ్బులు లాగుతున్నారని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం.. మా ధర్మమని, పాటిస్తారా.? పాటించరా..? అన్నది ఎవరి ఇష్టాఇష్టాలను భట్టి వారు పాటిస్తుంటారని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహనం ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయాల్లోకి వెళ్తే..  

ఇక ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి మకర రాశిపై ఉండటంతో ఈ రెండు రాశులవారు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ధనస్సు, మేషం, కర్కాటక, సింహ రాశుల వారికి ఈ గ్రహణం అధమ ఫలాన్ని ఇస్తుందని, వృశ్చిక, మకర, మీన, మిధున రాశుల వారికి మధ్యమ ఫలం దక్కుతుందని, కన్య, తుల, కుంభ, వృషభ రాశుల వారికి శుభ ఫలములు అందుతాయని అంటున్నారు.

ఇక చంద్రగ్రహణ నిబంధనల విషయానికి వస్తే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యక్షంగా చూడకూడదు. 'కదలకుండా పడుకోవాలి' అన్నది అవాస్తవం. ఇంట్లో అన్ని పనులూ చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో దాదాపు ఏ ఆహారాన్నీ తీసుకోకపోవడమే మంచిది. ఆ తరువాత కూడా కొత్తగా వండుకున్నవి తింటేనే మేలని కూడా జ్యోతిష్యులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహార పదార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, గ్రహణం ముగిసిన తరువాత వండుకిని తినాలని సూచిస్తున్నారు.

మరీ శాస్త్రీయ పద్ధతులను, హిందూ సంప్రదాయాన్ని అనుసరించాలని భావించే వారు, గ్రహణం ముందు, గ్రహణ సమయంలో, గ్రహణం తరువాత స్నానాలు చేసి ధ్యానం చేస్తూ ఉండవచ్చు. గ్రహణం పూర్తి తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు దాన్ని మార్చుకోవాలి. ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే, గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles