Rajasthan Bride Arrives At Ritual On Horseback ‘భండోరి’ వేడుకకు గుర్రంపై వధువు..

Rajasthan bride arrives at ritual on horseback with a message

Gargi Ahlawat, wedding ritual, horseback, charriot, Santosh Ahlawat, Jhunjhunu BJP MP, Bhandori, 'Beti Bachao Beti Padhao', Narendra Modi, Chirawa, Rajasthan, Politics

Daughter of BJP MP Santosh Ahlawat from Jhunjhunu, Gargi Ahlawat rides a carriage to her pre wedding ritual; her mission Prime Minister Modi's 'Beti Bachao, Beti Padhao'

ఆనవాయితీకి బ్రేక్: ‘భండోరి’ వేడుకకు గుర్రంపై వధువు..

Posted: 01/30/2018 06:06 PM IST
Rajasthan bride arrives at ritual on horseback with a message

సాధారణంగా పెళ్లిలో పెళ్లికొడుకుని కారులోనో.. గుర్రంపైనో లేదా గుర్రపు బండిలోనే ఊరేగింపుగా తీసుకురావడం అనవాయితి. అయితే రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లా పరిధిలోని చిర్రావా పట్టణంలో మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయ్యింది. అదేంటి అంటేరా..? వరుడికి బదులుగా వధువు అక్కడ గుర్రపు రథంపై ఊరేగింపుగా రావడంతో.. అక్కడి స్థానికులు ఏకంగా తమ ఇళ్ల పై అంతస్థుకు చేరుకుని మరీ వేడుకను అస్వాధించారు. పెళ్లి కూతురు గుర్రపు రథంపై ఊరేగుతుందన్న వార్తతో స్థానికంగా హల్ చల్ చేసింది.

యూకే లో ఎంబీఏ పూర్తి చేసి వచ్చిన వధువు ఇలా చేయడం వెనుకు ఓ సందేశం ఇవ్వాలన్న సంకల్పం కూడా వుందట. ఈ విషయాన్ని అమె అనంతరం మీడియాతో వెలువరించింది. ఇక దీనికి తోడు అమె స్థానిక పార్లమెంటు సభ్యురాలి కుమార్తె కూడా కావడం గమనార్హం. దీంతో అమె అనుకున్నదే తడవుగా అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన అధికార బీజేపి ఎంపీ సంతోష్‌ అహ్లావత్‌ కుమార్తె గార్గీకు ఢిల్లీకి చెందిన కుశల్ తో వివాహం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి-1న పెళ్లి జరగనుంది.

అయితే తమ సంప్రదాయం ప్రకారం.. వివాహానికి ముందు వధూవరుల బంధువులు కాబోయే దంపతులను పరస్పరం తమ ఇంటికి భోజనానికి పిలిచే కార్యక్రమం వుంటుంది. దానినే భండోరి అని పిలుస్తారు. ఈ విందు కార్యక్రమం తర్వాత వరుడిని గుర్రంపై ఊరేగిస్తూ పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వధువు గార్గీ గుర్రపు రథంపై స్థానిక వీధుల్లో ఊరేగించారు. దీని వెనుక బలమైన సందేశం కూడా వుందని మరీ చెబుతున్నారు వధువు బంధువులు. తాము పురుషుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని చాటడంతో పాటు తన సందేశాన్ని ప్రజలకు చాటాలంటే అనవాయితీని బ్రేక్ చేయాల్సిందేనని అంటోంది గార్గీ.

అదేంటంటే.. కూతుళ్లు కూడా కొడుకులతో సమానమేనని.. చాటి చెప్పేందుకే తాను అనవాయితిని బ్రేక్ చేశానని అంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన బేటి బచావ్.. బేటీ పడావ్ పథకాన్ని ఇలా ప్రచారం చేసేందుకు అవకాశం లభించిందని కూడా చెప్పుకోచ్చింది. గార్గీ తల్లి, బీజేపి ఎంపీ సంతోష్‌ అహ్లావత్‌ గత కొన్నేళ్లుగా మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నారు. ప్రధాని మోడీ చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో ప్రచారం కోసం తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు తల్లిలాగే కుమార్తె కూడా మహిళల కోసం పాటుపడుతున్నారని పలువురు అభినందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gargi Ahlawat  wedding ritual  horseback  charriot  Santosh Ahlawat  Chirawa  Rajasthan  

Other Articles