Pawan Clarifies about Alliance for 2019 Elections | ఏపార్టీకి మద్ధతు అన్నది అంశాన్ని బట్టే నిర్ణయిస్తాం : పవన్

Pawan speech at anantapur office bhoomi puja

JanaSena Party, Pawan Kalyan, Anantapur Jana Sena Office, Pawan Anantapur, Pawan Kalyan Anantapur Bhoomi Puja, Anantapur Welcomes JANASENA

JanaSena Anantapur Party Office Bhoomi Puja. Jana Sena Chief Pawan Kalyan Speech about Party Philosophies and Alliance for 2019 Elections.

అంశాన్ని బట్టే మద్ధతు గురించి ఆలోచిస్తా : పవన్

Posted: 01/27/2018 03:37 PM IST
Pawan speech at anantapur office bhoomi puja

తనపై ఎంత మంది, ఎన్ని విమర్శలు చేసినా, తాను మాత్రం దేన్నీ పట్టించుకోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం అనంతపురంలో జనసేన పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయగా.. ఆయన హాజరయ్యారు. వ్యక్తిగతంగా తనకు నాయకులందరితో పరిచయాలు ఉన్నాయని... తనకు ఎవరితో శత్రుత్వం లేదని చెప్పారు.

సమస్యల సాధన కోసం తాను పని చేస్తానని, ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని అన్నారు. రాయలసీమ వ్యాప్తంగా కరువు ప్రభావిత ప్రాంతాల్లో వ్యక్తిగతంగా పర్యటిస్తానని, ఆ తర్వాత మేధావులతో చర్చించి, సమస్యలకు పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తానని తెలిపారు. ‘‘కరువు సమస్యలపై అధ్యయనం చేస్తా. పరిష్కారాల కోసం కేసీఆర్‌, చంద్రబాబులను కలుస్తా. నేను ఎవరికీ తొత్తునుకాను. రాజకీయాల్లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. అంశాలను బట్టి మద్దతు ఇస్తా. రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతా’’ అని పవన్ పేర్కొన్నారు.

సీమ సమస్యలపై ఓ బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలుస్తానని.. ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని పవన్ ఉద్ఘాటించారు. ‘ఓటు బ్యాంకు రాజకీయాలకు నేను దూరం. నా పని నచ్చితేనే ఓటువేయమని అడుగుతా’ అని ఆయన చెప్పుకొచ్చారు. తన పోరాటం కేవలం 2019 కోసం మాత్రమే కాదని... 25 ఏళ్లపాటు కొనసాగే పోరాటమని పవన్ స్పష్టం చేశారు.

రైతుల సభలో...

ఎవ‌రైతే రైతుల‌కు అండ‌గా ఉంటారో వారికి తాను మ‌ద్ద‌తిస్తానని పవన్ మరో స్పష్టతనిచ్చారు. ఈ రోజు ఆయన అనంతపురంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... అనంత‌పురం రైతాంగ క‌న్నీరుని ఎవ‌రు తుడుస్తారో వారికి తాను అండ‌గా ఉంటానని చెప్పుకొచ్చారు.

ఏ పార్టీకయినా మ‌ద్ద‌తిచ్చే ముందు అనంత‌పురానికి అండ‌గా ఎలా నిల‌బ‌డతార‌ని అడుగుతానని పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుందని, అనంత‌పురం నుంచి తనకు మద్దతు కావాలని కోరారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు వచ్చి ఓటేయమని అడుగుతారని, అనంతపురానికి ఏం చేశారని నిలదీయాలని చెప్పారు. అలాగే అనంతపురం ప్రజలు ఇష్టమైతేనే జనసేన పార్టీకి ఓటు వేయాలని, లేదంటే తనను ఓడించాలని అన్నారు. 2019 ఎన్నికల్లో అనంతపురం నడుంబిగించకపోతే ఎప్పటికీ ఈ ప్రాంతం సమస్యలు పోవని అన్నారు.

అభిమాని కోసం ఓ సెల్ఫీ ..
జనసేన అధినేత అనంత పర్యటనలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అనంతపురంలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేసిన తర్వాత, ఆయన భారీ బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ ను కలవడం కోసం ఓ అభిమాని చేసిన ప్రయత్నంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. డయాస్ వద్దకు తోసుకు వస్తున్న అభిమానులను కట్టడి చేస్తున్న పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని వేదికపైకి వచ్చాడు. వెంటనే పవన్ ను గట్టిగా హత్తుకున్నాడు. పవన్ కూడా అతన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అయితే, అక్కడున్న పోలీసులు, నేతలు మాత్రం షాక్ కు గురయ్యారు.

వెంటనే తేరుకుని అతన్ని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. సదరు అభిమాని మాత్రం పవన్ ను వదలకుండా గట్టిగా పట్టుకునే ఉన్నాడు. చివరకు పవన్ తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపడంతో... అతని ఫోన్ ను పవన్ తీసుకుని స్వయంగా సెల్ఫీని తీశారు. అనంతరం సదరు అభిమాని ఎంతో సంతోషంగా వెళ్లిపోయాడు. పవన్ తో కలవడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles