hyderabad selfie videos is old one ఎంఎంటీఎస్ రైల్వే సెల్ఫీ వీడియో అసలు ట్విస్టు

Refrain from selfies stunts near rail tracks railway minister

jammu youth stupidity, Piyush Goyal, Railways,Railway Police Force,Railway ministry,Railway Minister,Indian Railways, Viral Video, Selfie, Hyderabad, Death video, MMTS Train, Social Media Video, Video Viral, Moving Train Selfie

Railway Minister Piyush Goyal urged the youth to refrain from taking selfies on rail tracks, days after a 22-year-old man from Hyderabad suffered grievous injuries during one such attempt.

సెల్ఫీల కోసం సాహసాలా..? ఆ వీడియో ట్విస్టు..

Posted: 01/25/2018 05:55 PM IST
Refrain from selfies stunts near rail tracks railway minister

వాట్సాప్ స్టేట‌స్ కోసం ట్రాక్ మీద వెళ్తున్న రైలుతో సెల్ఫీ వీడియో తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి, ప్రాణాల మీదికి తెచ్చుకున్న యువ‌కుడు వీడియో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న గురించి నేష‌న‌ల్ మీడియాలో కూడా క‌థ‌నాలు ప్ర‌సార‌మ‌య్యాయి. దీని గురించి రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఇటీవ‌ల ఇలాంటి సంఘ‌ట‌న‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

'గ‌త కొన్ని రోజులుగా రైల్వే ట్రాక్‌ల మీద సెల్ఫీల కోసం ప్రయత్నిస్తూ, ప్ర‌మాదాలు కొని తెచ్చుకుంటున్న ఘ‌ట‌న‌లు పెరుగుతుండ‌టం చాలా బాధ‌గా ఉంది. ద‌య‌చేసి మీ జీవితాల‌ను వృథా చేసుకోకండి. మీ సృజ‌నాత్మ‌క‌త‌ను స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప‌నుల వైపు మ‌ళ్లించి, దేశ అభివృద్ధికి పాటుప‌డండి' అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ప్ర‌జ‌ల‌కు రాసిన ఓ లేఖ‌ను కూడా పోస్ట్ చేశారు. రైల్ ట్రాక్‌ల మీదుగా సెల్ఫీలు తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించొద్ద‌ని, ట్రాక్‌లు దాటే ముందు సిగ్న‌ళ్లు, నియ‌మాలు పాటించాల‌ని ఆయ‌న కోరారు.

హైదరాబాద్ భరత్ నగర్ రైల్వేస్టేషన్ దగ్గర శివ అనే యువకుడు సెల్ఫీ తీసుకున్న వీడియో వైరల్ గా మారింది. జాతీయ మీడియా కూడా దీనిపై కథనాలు ప్రసారం చేయడంతో దేశవ్యాప్తంగా శివ వీడియో సంచలనం సృష్టించింది. వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ రైలు ముందు నుంచొని సెల్ఫీ తీసుకుంటూ గాయపడ్డ యువకుడిగా.. దేశంలోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు శివ. అయితే ఆ యువకుడు మరణించాడని కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాయగా, మరికొన్ని చికిత్స పోందుతున్నాడని రాశాయి.

 అయితే ఇంతకూ ఆరోజు ఏం అసలు జరిగింది.. గాయాలు ఎంతవరకు అయ్యాయి.. ఉన్నాడా.. చనిపోయాడా...? ఈ ఘటన ఎన్ని రోజుల క్రితం జరిగింది..? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం నెట్ జనులు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. అయితే యువకుడు శివ మాత్రం నిక్షేఫంగా వున్నాడు. వరంగల్‌కు చెందిన శివ.. మాదాపుర్ జిమ్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. ఆ విషయాలు తరువాత ఇప్పుడెలా వున్నాడన్న వివరాల్లోకి వెళ్తే.. ఆ వీడియో ఎనిమిది నెలల క్రితానిది. అంటే ఎనమిది నెలల క్రితం తీసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

ఓహా అలాగా..? అంటూ నిట్టూర్చుతున్నారా.. అయితే ఈ సెల్ఫీ వీడియో షూట్ చేసిన సమయంలో ఎంఎంటీఎస్ రైలు తలకు బలంగా తగిలి శివ గాయపడ్డాడు. దీంతో పాటు చేతికి కూడా గాయాలయ్యాయి. అయితే ప్రాణాలతో బయటపడ్డటం సంతోషం. కొన్ని రోజుల చికిత్స తరువాత శివ యధావిధిగా జిమ్ ట్రేనర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ హ్యాపీగా ఉన్నాడని.. అతని మిత్రులు చెబుతున్నారు. అయితే ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదని శివ వాపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Viral Video  Selfie  Piyush Goyal. Hyderabad  MMTS Train  Social Media  Video Viral  

Other Articles