Police Chase Ends with Violent Crash in Arizona | వైరల్ : పోలీసుల ఛేజింగ్.. చివరకు భయానక యాక్సిడెంట్

West valley police chase ends horrible

Police Chase, Arizona, Mitchell Taebel, Horrible Police Chase, west Valley

Police Chase Ends with Violent Crash in Tempe, Arizona. High-speed chase suspect speaks from jail: 'Absolutely legal to resist arrest with force'. The man Mitchell Taebel who police said led law enforcement on a high-speed chase spoke to reporters from jail on Wednesday and claimed he was innocent and had the right to fight back against police. the dramatic ending to a police chase that started in the west Valley and ended near Arizona State University's campus.

ITEMVIDEOS:దొంగ కోసం లాంగ్ ఛేజింగ్.. చివరకు...

Posted: 01/27/2018 04:14 PM IST
West valley police chase ends horrible

సినిమాను తలదన్నే సీన్ అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు ఓ నిందితుడి కారును ఛేజ్ చేసి మరీ వెంబ‌డించారు. అలా కొన్ని కిలోమీట‌ర్ల పాటు కొనసాగిన ఆ ఛేజింగ్‌లో నిందితుడి చిక్కిపోయాడు. అది అలా ఇలా కాదు.. కారు ప్రమాదానికి గురవ్వటంతో దొరికిపోయాడు.

రెడ్ కలర్ కారులో నిందితుడు పారిపోతున్నాడు. వెనుక పోలీస్ వ్యాను వస్తుండగా నిందితుడు వారికి చిక్కకుండా కొన్ని కిలోమీటర్లు తప్పించుకోగలిగాడు. చివరకు ఓ ఎక్స్ రోడ్ వద్ద సిగ్నల్ పడడంతో కొన్ని క్షణాలు ఆపాడు. ఇంతలో పోలీసులు ఆ నిందితుడి కారు వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా మళ్లీ వేగం పుంజుకుని ముందుకు దూసుకెళ్లాడు. ఆ కొద్దిసేపటికే ఓ కారుని ఢీ కొట్టాడు. దీంతో నిందితుడి కారుతో పాటు అతడు ఢీ కొట్టిన కారు ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి.

ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. ఘటనలో నిందితుడికి స్వల్పగాయాలు కాగా, అతడు ఢీ కొట్టిన కారులోని వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. సదరు నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles