bjp leader arrested in B.com student suicide case బికాం విద్యార్థినిని మతోన్మాదం మట్టుబెట్టింది..

Bjp leader arrested in b com student suicide case

dhanya shree, i love muslims, santosh, chatting, B.Com, student, suicide case, arrest, BJP leader, Mangaluru, karnataka, crime

The suicide case of B.Com student Dhanyashree(20) has got a new twist with primary investigation by the police revealing that she ended her life following moral policing.

బికాం విద్యార్థినిని మతోన్మాదం మట్టుబెట్టింది..

Posted: 01/09/2018 04:56 PM IST
Bjp leader arrested in b com student suicide case

కర్నాటకలోని బీజేపి ప్రాబల్యం అధికంగా వున్న చిక్‌మంగళూరులో మతోన్మాద కాటుకు డిగ్రీ విద్యార్థిని బలైంది. ఇటీవల ఇక్కడ విద్యార్థినులు ముస్లిం కుర్రాళ్లతో పార్కులో కనబడటంతో పోలీసుల సమక్షంలోనే విద్యార్థునులపై దాడి చేసిన ఘటనను మర్చిపోకముందే మరో దారుణ ఘటన జరిగింది. ధన్యశ్రీ(20) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి 10గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

ఈ కేసులో తన కూతురు చదవకుండా నిత్యం స్మార్ట్ ఫోన్ తో చాట్ చేస్తుందన్న కోసం తాను ఫోన్ తీసుకున్నానని, దీంతో మనస్తాపం చెందిన అమె మరణించిందని మొదట ధన్యశ్రీ తండ్రి పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే ప్రాధమిక విచారణ తరువాత దర్యాప్తులో భాగంగా అమె ఫోన్ ను పరిశీలించిన పోలీసులకు అసక్తికర విషయాలు తెలిసాయి. దీంతో స్థానిక బీజేపి నేత అనీల్ ను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతున్న ధన్యశ్రీ ఓ ముస్లిం యువకుడితో స్నేహంగా ఉండేది. దీంతో ఈమె వర్గానికి చెందిన సంతోష్ అనే యువకుడు అతనితో స్నేహాన్ని మానుకోమని ధన్యశ్రీని వాట్సప్ చాటింగ్‌లో హెచ్చరించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. సంతోష్ వైఖరి నచ్చని ధన్యశ్రీ ‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని ముస్లిం యువకుడితో కలిసి దిగిన ఫొటో పెట్టి మరీ రిప్లై ఇచ్చింది.
 
సంతోష్ ఆమె రిప్లైని స్క్రీన్‌షాట్ తీసి సంఘ్‌పరివార్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటోపై ఆమెకు సోషల్ మీడియాలో బెదిరింపులు రావడం వల్లనో లేక ఆ ఫొటోపై అసభ్యకర కామెంట్స్ చేసినందు వల్ల మనస్తాపానికి లోనయ్యో ధన్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం సాయంత్రం కొంతమంది యువకులు ఇంటికొచ్చి తనను, తన తల్లిని బెదిరించారని ధన్యశ్రీ సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhanya shree  i love muslims  santosh  chatting  BJP leader  Mangaluru  karnataka  crime  

Other Articles