Arrest authorities, not journalist says Edward Snowden ‘ఆధార్ లీక్’ జర్నలిస్టుకు అవార్డుకు బదులు ఎఫ్ఐఆర్..?

Edward snowden condemns arrest of journalist who exposed data breach

Aadhaar card, Edward Snowden, aadhaar leak, Unique Identification Authority of India, Ravi Shankar Prasad, NSA, rachna khaira, freedom of press

American whistleblower Edward Snowden delivered a firm reproof to the Indian government for "destroying the privacy" of its citizens and spoke out in support of the journalist.

‘ఆధార్ లీక్’ జర్నలిస్టుకు అవార్డుకు బదులు ఎఫ్ఐఆర్..?

Posted: 01/09/2018 05:59 PM IST
Edward snowden condemns arrest of journalist who exposed data breach

దేశపౌరులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అక్రమమార్గంలో లీక్ అవుతున్నాయని, దీంతో దేశ పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందోళన వ్యక్తం చేస్తూ కథనాన్ని రచించిన జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని విజిల్ బ్లోయర్, అవినీతి వ్యతిరేక కార్యకర్త ఎడ్వర్డ్ స్నోడన్ అవేదన వ్యక్తం చేశాడు. దేశపౌరుల సమాచారం పక్కదారి పడుతున్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన అభినందించి అవార్డును అందజేయాల్సిన ప్రభుత్వం.. ఈ కథను వెలుగులోకి తీసుకువచ్చినందుకు పోలీసు కేసును బహుమతిగా ఇవ్వడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.

భార‌త‌దేశ ప్ర‌జ‌ల ఆధార్ వివ‌రాలు హ్యాక్‌కి గురయ్యాయ‌ని ద‌ ట్రిబ్యున్ ప‌త్రిక‌లో క‌థ‌నం ప్ర‌చురించిన జ‌ర్న‌లిస్ట్ రచ‌నా ఖైరా మీద ఆధార్ సంస్థ ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డంపై విజిల్ బ్లోయ‌ర్ ఎడ్వ‌ర్డ్ స్నోడెన్ స్పందించారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం మానేసి, స‌మ‌స్య‌ను గుర్తించిన వారిని నియంత్రించాల‌నుకోవ‌డం స‌బ‌బు కాద‌ని స్నోడెన్‌ పేర్కొన్నారు. అధికార దుర్వినియోగాన్ని బ‌య‌టిపెట్టినందుకు స‌ద‌రు జ‌ర్న‌లిస్టుకి అవార్డు ఇవ్వాల్సింది పోయి ఇలా విచార‌ణ‌కు ఆదేశించ‌డమేంట‌ని స్నోడెన్ ఓ ట్వీట్ ద్వారా ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వానికి నిజంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌నే ఉద్దేశం ఉంటే ఇలాంటి చ‌ర్య‌లు తీసుకోద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బిలియ‌న్ల మంది భార‌తీయుల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేసే పాల‌సీల‌ను మార్పు చేయ‌డ‌మో లేక దుర్వినియోగానికి పాల్ప‌డి త‌ప్పు చేసిన వారిని శిక్షించ‌డ‌మో చేయాల‌ని స్నోడెన్ సూచించారు. మ‌రోవైపు హ్యాక్‌కి సంబంధించి వార్త‌లు వ‌చ్చిన‌పుడు కూడా స్నోడెన్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ట్టాలు తీసుకువ‌చ్చిన‌ప్ప‌టికీ, వ్య‌క్తిగ‌త వివ‌రాల హ్యాక్‌ని అరిక‌ట్ట‌లేర‌ని స్నోడెన్ గ‌త‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles