Bengaluru saw record number of drunk driving cases రికార్డులను బ్రేక్ చేస్తున్న మందుబాబులు

At 73 741 bengaluru saw record number of drunk driving cases in 2017

drunk driving cases, bangalore record, singhal, Hithendra, Dec, Community Against Drunken Driving, Bill

The drunk driving menace continues to be rampant in Bengaluru, which recorded the highest ever number of cases for the offence in 2017.

రికార్డులను బ్రేక్ చేస్తున్న మందుబాబులు.. యువతే కీలకం

Posted: 01/09/2018 02:11 PM IST
At 73 741 bengaluru saw record number of drunk driving cases in 2017

నేరాలు చేస్తాం అయితే ఏంటి అనే నేటి తరం యువత ధోరణి ఎంతగా మారుతుందో.. ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇది చిన్నపాటి నేరమేగా అనుకుని అభిప్రాయానికి వచ్చేవారు.. ఎదుటివాళ్లను ప్రమాదాల్లకి నెట్టివేస్తూ.. తాము మాత్రం జారుకుంటున్నారు. ఇక మరికోందరు తొటి వాహనదారుల ప్రాణాలతో చెలగాటం అడుతూ రోడ్డుపైకి వచ్చేస్తున్నారు. అసలు నేటి తరం యువత ప్రాణబీతి లేకుండా పోతుందంటే అతిశయోక్తి కాదు.

మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు పదే పదే చెబుతున్నా.. నేటి యువత మాత్రం ఆ మాటాలను పెడచెవిన పెడుతుంది. మరీముఖ్యంగా దేశంలోనే బెంగళూరు నగర యువత.. పోలీసుల మాటలను ఎంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారంటే.. ఏకంగా డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో రికార్డు సృష్టించేశారు. గత సంవత్సరం బెంగళూరులో 73,741 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదైనాయని పోలీసు రికార్డులు స్పష్టం చేశాయి.

2016వ సంవత్సరంలో 59,028 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా 2017లో వీటీ సంఖ్య 25 శాతం పెరిగింది. నిరంతరం తనిఖీలతో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై ఎక్కువ కేసులు నమోదైనాయి. సాధారణ వాహనచోదకులే కాకుండా అంబులెన్స్ డ్రైవర్లు, స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లు కూడా మద్యం తాగి నడిపారని పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. సంవత్సరం మొత్తంలో ఒక్క డిసెంబరు నెలలోనే అత్యధికంగా 10,517 కేసులు నమోదైనాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles